రాష్ట్రానికి సమర్థ నాయకుడు అవసరం
ABN , Publish Date - Apr 17 , 2024 | 12:25 AM
రాష్ట్రానికి చంద్రబాబు వంటి సమర్థ నాయకుడు అవసరమని కూటమి అభ్యర్థి అదితి గజపతి రాజు కోరారు.
విజయనగరం రూరల్: రాష్ట్రానికి చంద్రబాబు వంటి సమర్థ నాయకుడు అవసరమని కూటమి అభ్యర్థి అదితి గజపతి రాజు కోరారు. గాజులరేగ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ గార సత్యనారాయణ, గార ఉమ, కఠారి శ్రీనివాసులు, గేడు సూర్యనారాయణతో పాటు 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరిని ఆమె పార్టీలోకి ఆహ్వానించారు. నగరంలోని 26, 10 డివిజన్లకు చెందిన కొందరు టీడీపీలో చేరారు. టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్, ఆల్తి బంగారుబాబు, పిళ్లా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం రూరల్: రానున్న ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇవ్వాల ని ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 11 నుంచి 20వ డివిజన్ల పరిధిలోని టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు, యూనిట్ ఇన్‌చార్జి లు, బూత్ ఇన్‌చార్జిలు, కుటుంబ సాధికారిక సభ్యులతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజ్జపు ప్రసాద్, కనకల మురళీమోహన్, కాళ్ల గౌరీశంకర్, కర్రోతు నర్సింగరావు పాల్గొన్నారు.