వారి సేవలు అనిర్వచనీయం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:36 AM
హోంగార్డుల సేవలు అనిర్వచమని, పోలీస్ శాఖలో వారు వెన్నెముక లాంటి వారని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో హోంగార్డుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
బెలగాం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): హోంగార్డుల సేవలు అనిర్వచమని, పోలీస్ శాఖలో వారు వెన్నెముక లాంటి వారని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో హోంగార్డుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డులు నిర్వహించిన పరేడ్‌ను ఎస్పీ పర్యవేక్షించారు. అనంతరం వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 1948లో స్థాపించిన హోంగార్డుల వ్యవస్థ ఒక సాధారణ సర్వీస్‌లా మొదలై.. ఇప్పుడు పోలీస్ శాఖలో కీలకంగా మారిందని ఆయన చెప్పారు. కేసుల దర్యాప్తుల్లోనూ వారి సహకారం మరువలేనిదన్నారు. హోంగార్డుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీనిలో భాగంగానే నెలకు రెండు రోజుల వేతనంతో కూడిన సెలవులు, మహిళా హోంగార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేస్తుందన్నారు. కో ఆరేటివ్ క్రెడిట్ ద్వారా ఇచ్చే లోన్‌ను పెంచు తున్నట్లు తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు దిలీప్‌కిరణ్, అంకిత సురానా, ఆర్మడ్ రిజర్వ్ డీఎస్పీ థామస్ రెడ్డి ఎస్‌బీ సీఐ రంగనాథం, సోషల్ మీడియా సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.