గ్రామాల్లో భూ సమస్య లేకుండా చేయాలి
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:05 AM
గ్రామాల్లో భూ సమస్య లేకుండా చేయాలని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ అధికా రులకు ఆదేశించారు.
ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన
సాలూరు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో భూ సమస్య లేకుండా చేయాలని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ అధికా రులకు ఆదేశించారు. ఆదివారం సాలూరులోని తన నివాసంలో ఆమె ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంతో పాటు రెండు జిల్లాల నుంచి భారీ స్థాయిలో ప్రజలు వచ్చి ఆమెకు వినతులు సమర్పించారు. అనంతరం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రజా సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యతా ప్రకారం సమస్యలు పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టడానికి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నా మని మంత్రి తెలిపారు. వీఆర్వో నుంచి తహసీల్దార్ వరకు గ్రామాల్లో పర్యటించి భూ సమస్యలు పరిష్కరించాలని ఆమె సూచించారు.