Share News

ఆ కేసులను తక్షణమే పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:19 PM

Those cases should be resolved immediately జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాలపై నమోదైన కేసులు తక్షణమే పరిష్కరించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్‌ మోనటరింగు కమిటీ సమావేశం సోమవారం జరిగింది

ఆ కేసులను తక్షణమే పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

ఆ కేసులను తక్షణమే పరిష్కరించాలి

ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాలపై వెంటనే స్పందించండి

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

విజయనగరం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాలపై నమోదైన కేసులు తక్షణమే పరిష్కరించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్‌ మోనటరింగు కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి... సంక్షేమానికి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు. కలెక్టర్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ, ఎస్‌సీ, ఎస్‌టీ కాలనీల్లో ఆకమించిన శ్మశాన భూములను గుర్తించి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆర్డీవోకు సూచించారు. ఈ సమస్యలపై స్థానిక ఎస్‌ఐ, తహసీల్దారు, సర్వేయర్‌ ముగ్గురు కలిసి తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతి నెల 30న మండలస్థాయిలో సివిల్‌ రైట్స్‌ డేని జరుపుతున్నామన్నారు. కోర్టులో 250 కేసులు పెండింగ్‌లో వున్నాయని, వీటిని సత్వరమే డిస్పోజల్‌ అయ్యేలా చూడాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని కోరారు. అందుకు అవసరమైన సాక్ష్యాలను వేగంగా సమర్పించాలని పోలీసులకు సూచించారు. ఎస్పీ వకుల్‌జిందాల్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీకి సంబంధించి 27 కేసులు నమోదు అయ్యాయని, 4 డీఎస్పీలు విచారణ జరుపుతున్నారన్నారు. 9 కేసులకు నెంబరు పడిందని, మూడు కేసులు రిఫర్‌ చేయడం జరిగిందని, 15 కేసులు విచారణలో వున్నాయని, 60 రోజుల్లో చార్జిషీట్‌ ఫైలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో జెసీ సేతు మాధవన్‌, సభ్యులు చిట్టిబాబు, సూర్యనారాయణ, రామస్వామి, సన్యాసిరావు, గణపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:20 PM