మూడు వేల ఎకరాల్లో జీడి మామిడి
ABN , Publish Date - Aug 07 , 2024 | 11:30 PM
జిల్లాలో మూడు వేల ఎకరాల్లో జీడి మామిడి నాటేందుకు సిద్ధంగా ఉన్నామని డ్వామా పీడీ కె.రామచంద్రరావు తెలిపారు.
కొమరాడ, ఆగస్టు 7 : జిల్లాలో మూడు వేల ఎకరాల్లో జీడి మామిడి నాటేందుకు సిద్ధంగా ఉన్నామని డ్వామా పీడీ కె.రామచంద్రరావు తెలిపారు. కంబవలస, విక్రంపురం, తదితర గ్రామాల్లో నాటిన జీడి మామిడి మొక్కలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది కొమరాడ మండలంలో 151 ఎకరాల్లో గుంతలు తవ్వి జీడి మామిడి మొక్కలు నాటనున్నామని తెలిపారు. ఈ వారంలోపు మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. రైతులందరూ మొక్కలు నాటి.. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. మూడేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను వినియోగించుకోవాలని కోరారు.