Share News

crismas నేడే క్రిస్మస్‌

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:35 AM

Today is Christmas క్రిస్మస్‌ సంబరాలకు వేళ అయింది. ప్రార్థనలకు క్రైస్తవులంతా సిద్ధమయ్యారు. చర్చిలను విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. డీజేలతో ఏసు పాటలను ఆలపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా చర్చిల ప్రాంగణాల్లో ఏసు పుట్టుకను తెలియజేస్తూ ఆలోచింపజేసేలా సెట్‌లను తీర్చిదిద్దారు.

crismas నేడే క్రిస్మస్‌
క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేస్తున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

నేడే క్రిస్మస్‌

క్రిస్మస్‌ సంబరాలకు వేళ అయింది. ప్రార్థనలకు క్రైస్తవులంతా సిద్ధమయ్యారు. చర్చిలను విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. డీజేలతో ఏసు పాటలను ఆలపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా చర్చిల ప్రాంగణాల్లో ఏసు పుట్టుకను తెలియజేస్తూ ఆలోచింపజేసేలా సెట్‌లను తీర్చిదిద్దారు. వాస్తవానికి వారం రోజుల నుంచే సెమీ క్రిస్మస్‌ పేరుతో సంబరాలు మొదలైపోయాయి. మంగళవారం రాత్రి ఏసు పాటలు, వేషదారణలతో వాడవాడలా ర్యాలీలు చేశారు. విజయనగరంలోని స్వీమ్స్‌ మెమోరియల్‌ బాప్టిస్ట్‌ చర్చి, ఆర్‌సీఎం చర్చి, లూథరన్‌ చర్చిల్లో భారీ సంఖ్యలో ప్రార్థనలు చేపట్టారు. ఫాదర్‌లు క్రీస్తు జననం.. క్రిస్మస్‌ విశిష్టత గురించి తమ, తమ సందేశాల్లో వివరించారు.

- విజయనగరం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి):

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్‌

జిల్లా ప్రజలకు కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో కేక్‌ను కట్‌ చేసి అందరికీ అందించారు. జేసీ సేతుమాధవన్‌, డీఆర్‌వో శ్రీనివాస్‌మూర్తి, బిషప్‌ సత్యరాజ్‌, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, సీపీవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 12:35 AM