Share News

విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం శిక్షణ

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:12 AM

జర్మనీ దేశంలో ఉద్యోగావకాశాల కోసం నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యూరా పర్సనల్‌ భాగస్వామ్యంతో జర్మనీలో పనిచేయాలనుకునే నర్సింగ్‌ విద్యార్థులకు జర్మన్‌ భాష నేర్పించడంతో పాటు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం శిక్షణ
విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం శిక్షణ

పార్వతీపురం, నవంబరు23 (ఆంధ్రజ్యోతి): జర్మనీ దేశంలో ఉద్యోగావకాశాల కోసం నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యూరా పర్సనల్‌ భాగస్వామ్యంతో జర్మనీలో పనిచేయాలనుకునే నర్సింగ్‌ విద్యార్థులకు జర్మన్‌ భాష నేర్పించడంతో పాటు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జీఎన్‌ఎం, బీఎస్సీ, నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన 35 ఏళ్లు వారు అర్హులన్నీరు. కనీసం రెండు, లేదా మూడేళ్ల బీఎస్సీ, జీఎన్‌ఎం అనుభవం అవసరమని తెలిపారు. ఆరు మాసాల పాటు తిరుపతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రాథమిక అర్హత పరీక్ష , ఇంగ్లిష్‌, డిజిటల్‌ స్కిల్స్స్‌, జ్ఞాన పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. వీసా పొందిన తర్వాత అభ్యర్థులు రూ.75 వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు ఈ 96769 65949 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Nov 24 , 2024 | 12:12 AM