పారదర్శకంగా ఇసుక పాలసీ: కలెక్టర్
ABN , Publish Date - Sep 09 , 2024 | 11:58 PM
పారదర్శకంగా ఇసుకపాలసీని అమలు చేస్తామని, సందేహాలు ఉంటే డిప్యూటీ కమిషనర్‌తో ఎప్పుడైనా మాట్లాడవచ్చని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. లారీ యాజమానులు ఉచిత ఇసుక సరఫరాలో ఇబ్బంది కల గకుండా చూడాలని జిల్లా అధికార యంత్రాంగం నుంచి అన్ని విధాలా సహకరి స్తామని చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లారీ యాజ మానులతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ పాలసీతో అవగాహన కల్పించారు.
విజయనగరం కలెక్టరేట్: పారదర్శకంగా ఇసుకపాలసీని అమలు చేస్తామని, సందేహాలు ఉంటే డిప్యూటీ కమిషనర్‌తో ఎప్పుడైనా మాట్లాడవచ్చని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. లారీ యాజమానులు ఉచిత ఇసుక సరఫరాలో ఇబ్బంది కల గకుండా చూడాలని జిల్లా అధికార యంత్రాంగం నుంచి అన్ని విధాలా సహకరి స్తామని చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లారీ యాజ మానులతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ పాలసీతో అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా వాహనాలను రిజిస్టర్ చేసుకోవాలని, ఇసుక కోసం కూడా వినియోగ దారులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకూ 87 వాహనాల రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. బొబ్బిలిలో 37 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, అక్టోబరు రెండోతేదీన మరో రెండు స్టాక్ పాయిం ట్లలో 1.5లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి రానుందని చెప్పారు. లారీలు ఇసుక కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదని, ఆన్ లైన్‌లో బుక్ చేసుకోగానే, టాగ్ చేసిన వాహనదారుడు మొబైల్ నెంబరుకు టైంస్లాట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. లారీ కెపాసిటీని అనుసరించి ధర నిర్ణయించనున్నట్లు చెప్పారు. గరిష్టంగా రోజుకు 20 టన్నుల వరకూ ఒక వ్యక్తికి అందజేస్తామని తెలిపా రు. జిల్లాలో సరాసరి రోజుకు 950 మెట్రిక్ టన్నుటు బుకింగ్ జరుగుతుందన్నారు. శ్రీకాకుళం కలెక్టర్‌తో మాట్లాడి ఇసుక రీచ్‌ని ఏర్పాటు చేయాలని కలెక్టరు అంబేడర్‌కు లారీ యాజమానులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రవాణాశాఖ ఉప కమిషనర్ మణికుమార్, మైన్స్ డీడీ సూర్యచంద్రరావు, ఎంవీఐలు రమణ, దురా ్గప్రసాద్, రవిశంకర్ పాల్గొన్నారు.