Share News

ఎత్తిపోతల పథకాలను గాడిన పెట్టాలి

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:48 PM

బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులు, వనరులకు సంబంధించిన ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే బేబీనాయన శనివారం ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన అన్న సుజయ్‌కృష్ణరంగారావు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో తెర్లాం మండలం లోచర్ల, బొబ్బిలి మండలం శివడవలస గ్రామాలకు తోటపల్లి ఎత్తిపోతల పథకాలను పెద్దమనసుతో మంజూరు చేశారని ప్రస్తావించారు.

ఎత్తిపోతల పథకాలను గాడిన పెట్టాలి
అసెంబ్లీలో మాట్లాడుతున్న బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన

ఎత్తిపోతల పథకాలను గాడిన పెట్టాలి

అసెంబ్లీలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):

బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులు, వనరులకు సంబంధించిన ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే బేబీనాయన శనివారం ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన అన్న సుజయ్‌కృష్ణరంగారావు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో తెర్లాం మండలం లోచర్ల, బొబ్బిలి మండలం శివడవలస గ్రామాలకు తోటపల్లి ఎత్తిపోతల పథకాలను పెద్దమనసుతో మంజూరు చేశారని ప్రస్తావించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయినప్ప టికీ వాటిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు జరగలేదని వివరించారు. లోచర్ల, ఆమిటి, శివడవలస, కమ్మవలస, దేవుపల్లి, ముత్తాయివలస గ్రామాల రైతులకు ఉపయోగ పడే ఈ పథకాలను సత్వరం పూర్తి చేయాల్సి ఉందని, ఆవైపుగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. వెంగళరాయసాగర్‌, పెద్దగెడ్డ ప్రాజెక్టులతో పాటు పాల్తేరు చానల్‌, తోటపల్లి కాలువల అభివృద్ధి చాలా అవసరమన్నారు. బొబ్బిలి గ్రోత్‌సెంటరులో పరిశ్రమల పేరుతో భూములను తీసుకున్న వారి చేత తక్షణం పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Nov 16 , 2024 | 11:48 PM