Share News

విద్యుత్‌ ఎర్త్‌కు బాలుడి బలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:31 PM

ఎలుకలను చంపేందుకు పెట్టిన విద్యుత్‌ ఎర్త్‌కు బాలుడు బలయ్యాడు. ఈ ఘటన కొమరాడ మండలం కూనేరు గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

 విద్యుత్‌ ఎర్త్‌కు బాలుడి బలి
అనేష్‌(ఫైల్‌), అనేష్‌ మృతదేహం

- ఎలుకలను చంపేందుకు చర్చి చుట్టూ అమర్చిన తీగలు

- ఆడుకుంటూ వెళ్లి తాకిన చిన్నారి

కొమరాడ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎలుకలను చంపేందుకు పెట్టిన విద్యుత్‌ ఎర్త్‌కు బాలుడు బలయ్యాడు. ఈ ఘటన కొమరాడ మండలం కూనేరు గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన జిన్నాన గిరి, దివ్య దంపతులకు అనేష్‌(4) అనే కుమారుడు ఉన్నాడు. వీరి ఇంటి సమీపంలో ఓ చర్చి ఉంది. చర్చిలోకి ఎలుకలు వచ్చి సామగ్రిని పాడు చేస్తున్నాయని కడ్రక కృష్ణ అనే వ్యక్తి చర్చి చుట్టూ విద్యుత్‌ (కంచెను) ఎర్త్‌ పెట్టాడు. ఈ విషయం తెలియని అనేష్‌ మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ఆ వైర్లను తాకడంతో షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుడిని పార్వతీపురం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. తమ కళ్లఎదుటే ఆడుతూ పాడుతూ తిరుగుతున్న బాలుడు ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌కి గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై కొమరాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:31 PM