Share News

వలంటీర్లను కొనసాగించాలి

ABN , Publish Date - Oct 08 , 2024 | 12:09 AM

గ్రామ, వార్డు వలంటీర్లకు ఎన్టీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వారిని విధుల్లో కొనసాగించి, రూ.10వేలు వేతనం ఇవ్వాలని సీఐటీయూ నాయకుడు యనమల మన్మథరావు డిమాండ్‌ చేశారు.

 వలంటీర్లను కొనసాగించాలి
కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న వలంటీర్లు

బెలగాం: గ్రామ, వార్డు వలంటీర్లకు ఎన్టీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వారిని విధుల్లో కొనసాగించి, రూ.10వేలు వేతనం ఇవ్వాలని సీఐటీయూ నాయకుడు యనమల మన్మథరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ వద్దకు ర్యాలీగా వచ్చి, ఆందోళన చేశారు. అనంతరం పీడీ రామంద్రరావుకు సమస్యలు తెలియజేశా రు. సీఐటీయూ నాయకులు ఇందిరా, బీవీ రమణ, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2024 | 12:09 AM