Share News

ఎస్‌.కోటను విశాఖలో కలిపేందుకు కట్టుబడి ఉన్నాం: ఎంపీ

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:10 AM

శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలిపేందుకు కట్టుబడి ఉన్నామని, తొలి ఏడాదిలోనే ఈ హామీ పూర్తిచేస్తామని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ తెల్చిచేప్పారు. శుక్రవారం శృంగవరపుకోట పుణ్యగిరిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానికులతో సమావేశమయ్యారు.

ఎస్‌.కోటను విశాఖలో కలిపేందుకు కట్టుబడి ఉన్నాం: ఎంపీ

శృంగవరపుకోట: శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలిపేందుకు కట్టుబడి ఉన్నామని, తొలి ఏడాదిలోనే ఈ హామీ పూర్తిచేస్తామని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ తెల్చిచేప్పారు. శుక్రవారం శృంగవరపుకోట పుణ్యగిరిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానికులతో సమావేశమయ్యారు. లలితకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సండిసోమేశ్వరరావు, వైస్‌ఎంపీపీ ఇందుకూరి సుధారాజు, సర్పంచ్‌ గనివాడ సంతోషి కుమారి, చంద్రశేఖర్‌, జీఎస్‌ నాయుడు పాల్గొరు.

ఫతెర్లాం: మండలంలోని ఉద్దవోలులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ప్రభుత్వం వందరోజుల పా లన గురించి వివరించారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యని ర్వాహక కార్యదర్శి బాబు పాలూరు, టీడీపీ మండలాధ్యక్షులు నర్సుపల్లి వెంకట నాయుడు, తేజోవతి, నర్సుపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఫ రాజాం రూరల్‌: మండలంలోని వీఆర్‌ అగ్రహారంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ ప్రా రంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విజనరీనేతని, వంద రోజుల కూటమి పాలన చారిత్రాత్మకమని తెలిపారు. కార్యక్రమంలో మండల నోడల్‌అధికారి నిర్మలాకుమారి, తహసీల్దార్‌ కృష్ణం రాజు, ఎంపీడీవో వావిలపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు గురవాన నారాయణరావు,శ్రీనివాసరావు, చింత చంద్రినాయుడు, శ్రీరాములు, రమణ, పొట్నూరు లక్ష్మణ, కన్నంనాయుడు, రఘు మండల గణపతి పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:10 AM