Share News

Farmers: రైతులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:08 AM

Farmers: రైతులకు అండగా ఉంటామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. శనివారం మండలంలోని గుణుపూరుపేటలో పొలాల్లో పరిశీలించారు.

Farmers: రైతులకు అండగా ఉంటాం
దెబ్బతిన్న వ రి పంటను పరిశీలిస్తున్న లోకం నాగమాధవి:

డెంకాడ, డిసెంబరు 28 (ఆంరఽఽధజ్యోతి):రైతులకు అండగా ఉంటామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. శనివారం మండలంలోని గుణుపూరుపేటలో పొలాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎనిమిది రోజులుగా కురిసిన వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలను నష్టపోయిన రైతులకు కూట మి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. తడిచి రంగుమారిన ధాన్యం ప్రభుత్వం కొనే విధంగా ప్రణాళిక చేపడతామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు అప్ర మత్తంగాఉండాలని, రైతు సేవా కేంద్రాల్లో అధికారులు నిర్ధారించిన ధాన్యం తేమ శాతాన్ని మిల్లర్లు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. మిల్లర్లు రైతుల వద్ద నుంచి డబ్బులు తీసు కున్నా, అలసత్వం వహించినా చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపా రు. కార్యక్ర మంలో ఎంపీపీ బి.వాసుదేవరావు,మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు, ఏవో నిర్మల, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, టీడీపీ మండలాధ్యక్షులు పల్లె భాస్కరరావు, పాణిరాజు, జనసేన నాయకులు కంది సూర్యనారాయణ, పైల శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:08 AM