Share News

మూడు నెలల్లో పూర్తి చేస్తాం

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:11 AM

సాలూరు పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని మరో మూడు నెలల్లో పూర్తి చేయించి, ప్రారంభోత్సవం చేసి సాలూరు నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయబోతు న్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

మూడు నెలల్లో పూర్తి చేస్తాం
అధికారులకు ఆదేశాలు ఇస్తున్న మంత్రి సంధ్యారాణి

  • వంద పడకల ఆస్పత్రి నిర్మాణం పరిశీలన

సాలూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని మరో మూడు నెలల్లో పూర్తి చేయించి, ప్రారంభోత్సవం చేసి సాలూరు నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయబోతు న్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఆమె శనివారం పరిశీలించారు. బిల్లుల విషయంపై సంబంధిత అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. సుమారు రూ.10లక్షలతో నిర్మిస్తున్న బర్త్‌ వెయిటింగ్‌ హాల్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో 2025 మార్చి నాటి కి నిర్మాణం పనులు పూర్తి జరిగేలా చర్యలు తీసుకుంటామ ని ఆమె హామీ ఇచ్చారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్‌ప ర్సన్‌ హోదాలో తాను ఉంటానని తెలిపారు. కౌన్సిల్‌ సభ్యుల నుంచి సభ్యుడిగా వైకుంఠపు హర్షవర్ధన్‌ను, అలాగే సభ్యులుగా కారేపు చంద్రరావు, కాళ్ళ శ్రీనులు నియమిస్తామని చెప్పారు. వైద్యుల వివరాలు బోర్డుల్లో ప్రదర్శించాలని, సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిసప్షనిస్ట్‌ను ఏర్పాటు చేయాలని సూచించా రు. ఆర్వో ప్లాంట్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమం లో డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావ తి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.ఏకే రత్నకుమారి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, పరమేష్‌, కూనిశెట్టి భీమారావు, పప్పల మోహన్‌, జనసేన నాయకుడు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:11 AM