Share News

ప్రతి సమస్యనూ పరిష్కరిస్తాం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:43 AM

రెవెన్యూ సదస్సుల్లో ప్రస్తావించే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. గొట్లాం సచివాలయంలో కలెక్టర్‌ అంబేడ్కర్‌ అధ్యక్షతన రెవెన్యూ సదస్సు శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ జనవరి 8 వరకు 33 రోజులపాటు 17 వేల రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు.

ప్రతి సమస్యనూ పరిష్కరిస్తాం
రైతు నుంచి అర్జీ అందుకుంటున్న మంత్రి, కలెక్టర్‌

ప్రతి సమస్యనూ పరిష్కరిస్తాం

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

బొండపల్లి, డిసెంబర్‌ 6(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల్లో ప్రస్తావించే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. గొట్లాం సచివాలయంలో కలెక్టర్‌ అంబేడ్కర్‌ అధ్యక్షతన రెవెన్యూ సదస్సు శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ జనవరి 8 వరకు 33 రోజులపాటు 17 వేల రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, కలెక్టర్‌, జేసి, రెవెన్యూ అధికారులు వస్తారని, సదస్సుల్లో అందే అర్జీలను ఎటువంటి రుసుం లేకుండా ఉచితంగా 45 రోజుల్లో పరిష్కరిస్తారని చెప్పారు. గత ప్రభుత్వం రీసర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను భ్రష్టు పట్టించిందని, భూమి పత్రాలను ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా పరిశీలించుకుని సమస్య ఉంటే పరిష్కరించుకు నేందుకు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతీ సోమవారం చేపట్టిన వినతుల స్వీకరణలో 9 వేల అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే అందాయని, వీటిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించి భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులను ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. సదస్సుల్లో తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్వో, మండల సర్వేయర్‌, రిజిస్ర్టేషన్‌ శాఖ ప్రతినిధులతో పాటు అటవీ, దేవదాయశాఖ అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. ముందస్తుగా గ్రామాల్లో టాంటాం, కరపత్రాలు పంపిణీ తదితరాల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. సదస్సుల్లో అందిన అర్జీలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిష్కరిస్తామన్నారు. సదస్సులో సగడాం వీధిలో హక్కులో ఉన్న ఏడుగురు లబ్ధిదారులకు గృహ పట్టాలు అందజేసినట్లు తహసీల్దార్‌ డోలా రాజేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి డి.ప్రమీలాగాంధీ, ఇన్‌చార్జ్‌ ఆర్డీవో, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సుధారాణి, టీడీపీ మండల అధ్యక్షుడు కె.కృష్ణ, సర్పంచులు, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు ముంజేటి పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:43 AM