Share News

Festivity సందడిగా..

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:54 PM

With Great Festivity గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో గిరిజనులు సంప్రదాయబద్ధంగా కందికొత్తల పండగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు సాగు చేసిన కందులు, జొన్నలు, రాగులు, కొర్రలు, వరి పంటలను శనివారం గిరిజన దేవతలకు నైవేద్యంగా సమర్పించారు.

 Festivity  సందడిగా..
తోటి గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేస్తున్న విప్‌ జగదీశ్వరి

థింసా నృత్యం చేసిన విప్‌ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో గిరిజనులు సంప్రదాయబద్ధంగా కందికొత్తల పండగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు సాగు చేసిన కందులు, జొన్నలు, రాగులు, కొర్రలు, వరి పంటలను శనివారం గిరిజన దేవతలకు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం వాటిని ప్రసాదంగా స్వీకరించారు. ఈ వేడుకలో ప్రభుత్వ విప్‌, కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి ఎంతో ఉత్సాహంగా థింసా నృత్యం చేశారు. గిరిజన సంప్రదాయ పండగకు తాడికొండ చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

నేడు గుమ్మలక్ష్మీపురంలో వేడుకలు

గుమ్మలక్ష్మీపురం హెచ్‌ గ్రౌండ్‌లో ఆదివారం కందికొత్తల పండుగను ఘనంగా నిర్వహించాలని గిరిజన ఐక్యత సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు శనివారం ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరికి నిర్వాహకులు పండుగ ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ సంప్రదాయ గిరిజన పండుగకు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాస్తవ తదితరులు రానున్నట్లు వారు తెలిపారు.

Updated Date - Dec 28 , 2024 | 11:54 PM