పర్యవేక్షణ లేక.. ఇసుక దందా ఆగక
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:10 AM
రేగిడి మండలం లోని బొడ్డవలస నాగావళి నదీతీరంలో ఇసుక తవ్వకాలపై పర్యవేక్షణ లేకపోవడంతో దందా ఆగడంలేదు. దీంతో ఇక్కడ ఇన్‌ఫిల్టర్ బావులకు ప్రమాదం పొంచిఉంది. ప్రధా నంగా రేగిడి మండలంలోని బొడ్డవలస నాగావళి తీరం నుంచి ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాలకు తాగునీరు సర ఫరా అవుతోంది.
రేగిడి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రేగిడి మండలం లోని బొడ్డవలస నాగావళి నదీతీరంలో ఇసుక తవ్వకాలపై పర్యవేక్షణ లేకపోవడంతో దందా ఆగడంలేదు. దీంతో ఇక్కడ ఇన్‌ఫిల్టర్ బావులకు ప్రమాదం పొంచిఉంది. ప్రధా నంగా రేగిడి మండలంలోని బొడ్డవలస నాగావళి తీరం నుంచి ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాలకు తాగునీరు సర ఫరా అవుతోంది. అయితే అవతలి ఒడ్డున ఉన్న గోపాలపురం పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దులోఉంది. ఇక్కడే ఎక్కువగా ఇసుక తవ్వకాలు జరుగు తున్నాయి.ఈ ప్రాంతం ఇన్‌ఫిల్టర్ బావులకు 500 మీట ర్లలోపు ఉండడంతో వేసవిలో నీటిలభ్యతపై ప్రభావం పడే అవకాశముందని ఆందోళన నెలకొంది.
ఇదీ పరిస్థితి..
రేగిడి మండలంలోని బొడ్డవలస నాగావళి నదీతీరంలో ఉమ్మడి జిల్లాల్లోని ఏడు మండలాలకు తాగునీటిసరఫరాచేసే ఇన్ ఫిల్టర్ బావులు ఉన్నాయి.ఇక్కడి నుంచే చీపురుపల్లితోపాటు రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో పలు మండలాల ప్రజలకు దాహర్తిని తీర్చుతున్న పథకాలకు తాగునీరందుతోంది. ఈ నేప థ్యంలో వైసీపీ హయాంలో ఇసుక దందాను నిలువరించలేకపో యారు. తాజాగా కుటమి ప్రభుత్వం కూడా ఇసుక తరలింపును అడ్డుకోలేకపోతోందని విమర్శలొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి అనుమతి ఇవ్వడంతో ఇన్‌ఫిల్టర్ బావు లకు సమీపంలోనే యంత్రాలతో తవ్వకాలు యథేచ్ఛగా చేస్తుండ డం విశేషం. వంతెనలు, ఇన్‌ఫిల్టర్ బావులకు 500 మీటర్ల దూరంలో యంత్రాలతో తవ్వకాలు చేయకూడదన్న నిబంధనలు సైతం బేఖాతర్ చేస్తున్నారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల తో ఇసుక తరలిస్తున్నారు. ఇన్‌పిల్టర్ బావులు ఉన్న ప్రాంతం మన్యం జిల్లా పరిధిలో ఉండడంతో తాము ఏమీ చేయలేకపోతు న్నామని రేగిడి మండల అఽధికారులు చెబుతున్నారు.