పని భారం తగ్గించాలి
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:33 AM
ఆశ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని ఆ సంఘ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
బలిజిపేట, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆశ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని ఆ సంఘ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అరసాడ పీహెచ్‌సీ వైద్యురాలు శివగాయత్రీకి వినతి పత్రం అందించారు. ఆశ వర్కర్లకు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. పనిభారం తగ్గించాలన్నారు. ఈనెల 18న పార్వతీపురంలో జరిగే కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.