క్రీడాస్ఫూర్తితో మెలగాలి
ABN , Publish Date - Aug 29 , 2024 | 11:53 PM
క్రీడాకా రులు క్రీడాస్ఫూర్తితో మెలగాలని ఎంఈవోలు మనోహర్, రామకృష్ణ పిలుపు నిచ్చారు.
పెద్దమండ్యం, ఆగస్టు29: క్రీడాకా రులు క్రీడాస్ఫూర్తితో మెలగాలని ఎంఈవోలు మనోహర్, రామకృష్ణ పిలుపు నిచ్చారు. పెద్దమండ్యం మండలంలో జాతీయ క్రీడా దినో త్సవం గురువారం కలిచెర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. హెచఎంలు, పీఈటీలు పాల్గొన్నారు.
గుర్రంకొండలో:జాతీయ క్రీడా దినోత్సవాన్ని గురువారం క్రీడాకారులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తరిగొండ, గుర్రంకొండలో విద్యార్థులు ర్యాలీ చేశారు. అనంతరం బస్టాండులో మానవహారంగా నిలబడి క్రీడల ప్రాముఖ్యతను వివరించారు.
వాల్మీకిపురంలో: వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హాకీ దిగ్గజం ధ్యాన చంద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు క్రీడలు, జానపద గీతాలపన, పద్య పఠనం, పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.
కలకడలో:జాతీయ క్రీడల దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపు కున్నారు. ఈ సందర్భంగా కోన హైస్కూల్, కలకడ ఆదర్శపాఠశాల్లో భారత హాకీ పితామహుడు ధ్యానచంద్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కోన హైస్కూల్ విద్యార్థులు ఫిరమిడ్ ఆకారంలో ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు.
నిమ్మనపల్లిలో: స్థానిక జడ్పీ హైస్కూల్లో గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని హెచఎమ్ అంజాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా విధ్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి పోటీల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లెలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని మోడల్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. హాకీ ఆటగాడు మేజర్ ధ్యానచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.