రూ.150 కోట్లతో 40 సబ్‌స్టేషన్లు
ABN , Publish Date - Oct 09 , 2024 | 12:41 AM
విద్యుత్ వినియోగదారు లకు లో ఓల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యు త్‌ను అందించాలన్న లక్ష్యం తో జిల్లాలో రూ.150 కోట్ల తో కొత్తగా 40 సబ్ స్టేషన్ల ను నిర్మించనున్నట్లు ఈపీ డీసీఎల్ ఎస్‌ఈ అలపాటి రఘునాధ్‌బాబు చెప్పారు.
నరసాపురం, అక్టోబరు 8: విద్యుత్ వినియోగదారు లకు లో ఓల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యు త్‌ను అందించాలన్న లక్ష్యం తో జిల్లాలో రూ.150 కోట్ల తో కొత్తగా 40 సబ్ స్టేషన్ల ను నిర్మించనున్నట్లు ఈపీ డీసీఎల్ ఎస్‌ఈ అలపాటి రఘునాధ్‌బాబు చెప్పారు. మంగళవారం నరసాపురం డివిజన్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కొత్తగా ఆర్డీఎస్‌ఎస్ నిధులతో నిర్మించే ఒక్కొక్క 33 కేవీ సబ్ స్టేషన్‌కు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నా రు. ప్రతి సబ్ డివిజన్‌లో ఆరు నుంచి ఎనిమిది వరకు నిర్మిస్తామన్నారు. ఎక్కువ సబ్‌స్టేషన్లను గ్రామీణ ప్రాం తాల్లోనే కడతామన్నారు. జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకానికి ఇప్పటి వరకు 2500 మంది దరఖాస్తు చేసు కున్నారని చెప్పారు. 290 దరఖాస్తులు సర్వే చేసి 155 మందికి ప్యానల్ బోర్డులు అమర్చామన్నారు. లో ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి అదనపు ట్రాన్స్‌ఫార్మర్స్ ఏర్పా టుకు అన్ని సబ్ డివిజన్లలో సర్వే చేస్తున్నామన్నారు. శిఽథిలావస్థకు చేరిన 11 కేవీ వైర్లు, ఫీడర్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏడీఈలు, ఏఈల తో సమీక్ష నిర్వహించారు. ఈఈ మధుకుమార్, ఏఈడీ ఓంకార్, ఏఈ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.