Share News

ఆకివీడు రాజకీయం.. రసవత్తరం

ABN , Publish Date - Nov 05 , 2024 | 01:11 AM

ఆకివీడు నగర పంచాయతీ రాజకీయం ఆసక్తికరంగా మా రింది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్‌ సమావేశం జరిగింది.

ఆకివీడు రాజకీయం.. రసవత్తరం
ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆకివీడు టీడీపీ, జనసేన కౌన్సిలర్లు

టీడీపీ, జనసేన కౌన్సిలర్ల ఆవేదన.. కౌన్సిల్‌ సమావేశానికి గైర్హాజరు !

ఎమ్మెల్యే రఘురామకు చెప్పినా పట్టించుకోలేదని విమర్శ

ఆకివీడు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఆకివీడు నగర పంచాయతీ రాజకీయం ఆసక్తికరంగా మా రింది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్‌ సమావేశం జరిగింది. దీనికి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు హాజర య్యారు. అయితే 13 మంది వైసీపీ కౌన్సిలర్లకు ముగ్గురు హాజరుకాలేదు. టీడీపీ, జనసేన కౌన్సిల ర్లు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అంతకంటే మించి ఎమ్మెల్యే రఘురామ తమను పట్టించుకోలేదని ఇక్కడకు వచ్చిన టీడీపీ, జనసేన క్యాడర్‌ తిరిగి వెళ్లిపోవడం మరింత ఆసక్తిక రంగా మారింది. పార్టీని అంటిపెట్టుకున్నందుకు తమకు ఎమ్మెల్యే తగిన బుద్ధి చెప్పారని పలు వురు శ్రేణులు వాపోయారు. మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఆకివీడులో మా త్రం వైసీపీ పాలనే కొనసాగుతోందని టీడీపీ, జనసేన కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు పార్టీల కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, కిమిడి అరుణకుమారి, బత్తుల శ్యామల, మోపిదేవి సత్యవతి, గోపిశెట్టి వెంకట సత్యవతి, గుర్రాన నాగలక్ష్మి, నేరెళ్ళ ప్రసన్న మాట్లాడుతూ ‘నగర పంచాయతీ చైర్మన్‌ అధికార యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకొని పాలన సాగిస్తున్నారు. టీడీపీ, జనసేన కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తు న్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన కౌన్సిలర్లతో వార్డుల్లో అభివృద్ధికి కొబ్బరికాయ కొట్టించలేదు. ఎమ్మెల్యే మంతెన రామరాజుకు ప్రొటోకాల్‌ పాటించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినా తమకు అదేవిధంగా జరుగుతోంది’ అని వాపోయారు.

ఆక్రమణల తొలగింపులో అడ్డుపడొద్దు : ఎమ్మెల్యే

ఆకివీడు అభివృద్ధికి పార్టీలతో సంబంధం లేకుండా సహకరించాలని ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. నగర పంచాయతీ చైర్మన్‌ జామి హైమావతి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఆకి వీడు మండలంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇటీవల దుంపగడపలో, నేడు అయి–భీమవరంలో మంచినీటి సమస్యతో తీవ్ర విషజ్వరాల తో జనం అల్లాడుతున్నారు. వాటిని నివారించేందుకే కాలువలు, చెరువులు బోదెల చుట్టూ ఆక్ర మణలు తొలగిస్తున్నాం. నాకు ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు. పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నా. ఆక్రమణల తొలగింపు సమయంలో రాజకీయ నాయకులు అడ్డుపడవద్దు. అర్హులుంటే పట్టాలు ఇస్తాం. గంగానమ్మకోడ్‌ ప్రాం తంలో ఆక్రమణలు పరిశీలించి, వారంలో తొలగించాల’ని అన్నారు. కమిషనర్‌ జి.కృష్ణమోహన్‌, పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 01:11 AM