Share News

ఆధార్‌ వేలిముద్రలతో రూ.30 వేలు కొట్టేశారు..

ABN , Publish Date - Aug 02 , 2024 | 12:27 AM

సైబర్‌ నేరగాళ్ళు ఆధార్‌ వేలిముద్రలు ద్వారా బ్యాంకు అకౌంట్‌లో ఉన్న నగదును అపహరించడంతో బాధితుడు సైబర్‌ టోల్‌ ఫ్రీనెంబర్‌ 1930కు ఫిర్యాదు చేశాడు.

ఆధార్‌ వేలిముద్రలతో రూ.30 వేలు కొట్టేశారు..

తిరిగి అకౌంట్‌లోకి రప్పించిన సైబర్‌ క్రైం పోలీసులు

ఏలూరు క్రైం, ఆగస్టు 1 : సైబర్‌ నేరగాళ్ళు ఆధార్‌ వేలిముద్రలు ద్వారా బ్యాంకు అకౌంట్‌లో ఉన్న నగదును అపహరించడంతో బాధితుడు సైబర్‌ టోల్‌ ఫ్రీనెంబర్‌ 1930కు ఫిర్యాదు చేశాడు. సైబర్‌ క్రైం పోలీసులు రంగంలోకి దిగి బాధితుడి అకౌంట్‌ నుంచి అపహరణకు గురైన సొమ్మును తిరిగి రప్పించారు. దీంతో బాధితుడు జిల్లా ఎస్పీ కిషోర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. పెదవేగి మండలం కవ్వగుంట గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావుకు ఏలూరు స్టేట్‌ బ్యాంక్‌లో సేవింగ్స్‌ అకౌంట్‌ ఉంది. అతని ఆధార్‌కార్డు అథెంటికేషన్‌ ద్వారా అతనికి తెలియకుండా రూ.30 వేలు అకౌంట్‌ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేశారు. దీంతో బాధితుడు సైబర్‌ సెల్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. అపహరణకు గురైన సొమ్మును తిరిగి తన అకౌంట్‌కు రప్పించారు.

Updated Date - Aug 02 , 2024 | 12:27 AM