Share News

భద్రత కరువైందని స్థానికేతరుల ఆందోళన

ABN , Publish Date - Oct 28 , 2024 | 11:36 PM

జిల్లాలు దాటి ఉపాధి కోసం వచ్చిన మాపై స్థానికంగా ఉండే కొంతమంది దాడులు చేస్తూ, భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని వారినుంచి రక్షణ కల్పించాలంటూ శ్రీకాకుళం, విజయనగరం ప్రాం తాలకు చెందిన వ్యక్తులు రహదారిపై ఆందోళ నకు దిగారు.

భద్రత కరువైందని స్థానికేతరుల ఆందోళన
కవ్వగుంటలో రహదారిపై ఆందోళన చేస్తున్న స్థానికేతరులు

పెదవేగి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలు దాటి ఉపాధి కోసం వచ్చిన మాపై స్థానికంగా ఉండే కొంతమంది దాడులు చేస్తూ, భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని వారినుంచి రక్షణ కల్పించాలంటూ శ్రీకాకుళం, విజయనగరం ప్రాం తాలకు చెందిన వ్యక్తులు రహదారిపై ఆందోళ నకు దిగారు. పెదవేగి మండలం కవ్వగుంటలో సోమవారం ఉదయం స్థానికేతరులైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వందమందికిపైగా కవ్వగుంట రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సమయంలో రహదారిపై రాకపోకలు నిలిచిపో వడం, సమాచారం అందుకున్న పెదవేగి సీఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ కె.రామకృష్ణలు సంఘ టనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. అయితే ఆందోళన చేస్తున్న వ్యక్తులు మాత్రం ఎంతకూ పట్టు వీడకుండా తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించారు. రెండుగంటలకు పైగా నిరసన వ్యక్తంచేశారు. 40ఏళ్ళుగా ఇక్కడే ఉంటూ, కూలీపనులతో జీవనం సాగిస్తున్న మాపై గడచిన నాలుగేళ్ళుగా స్థానికులు దాడులు చేస్తున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అలాంటి జరుగకుండా చూస్తా మని పోలీసులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు.

Updated Date - Oct 28 , 2024 | 11:36 PM