నులి పురుగులతో రక్తహీనత
ABN , Publish Date - Feb 09 , 2024 | 11:52 PM
నులి పురుగులతో రక్తహీనతతో పిల్లలు అనారోగ్యం పాలవుతారని ఎంపీపీ తాతా రమ్య అన్నారు.
పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు
పెదవేగి, ఫిబ్రవరి 9: నులి పురుగులతో రక్తహీనతతో పిల్లలు అనారోగ్యం పాలవుతారని ఎంపీపీ తాతా రమ్య అన్నారు. జాతీయ నులిపురుగుల నివార ణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో విద్యార్థులకు శుక్రవారం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. నులి పురుగుల కారణంగా ఆకలి మందగించి ఎదుగుదల లోపిస్తుందన్నారు. ప్రభుత్వం ఆరునెలలకోసారి నులి పురుగుల నివారణ మాత్రలను పిల్లలకు పంపిణీ చేస్తోందని ఆమె చెప్పారు. ఏఎన్‌ఎం మౌనిక, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పెదపాడు: పీహెచ్‌సీలో పరిధిలో పాఠశాల విద్యార్థులకు వైద్య సిబ్బంది నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. డాక్టర్ చక్రధర్ మాట్లాడుతూ పిల్లలు, కిశోర బాలల కడుపులో నులి పురుగులు ఉంటే పోషకాహార లోపం, రక్తహీనతతో శారీరక, మానసిక ఎదుగుల లోపాలను కలిగి ఉంటారన్నారు. వీటి నివారణకు అల్బెండజోల్ 400 మి.గ్రా. మాత్రను వేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం టౌన్: తాడువాయి ప్రాథమిక పాఠశాల విద్యార్థు లకు అల్బెండజోల్ మాతరలను అందజేసినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు ఎం.మనోజ్ఞ తెలిపారు. హెచ్‌ఎం ఆర్.నాగదుర్గారావు, ఏఎన్‌ఎం ఎం.వనితా జ్యోతి, ఎ.సరస్వతి, ఉపాధ్యాయురాలు పి.ఎలీషా, విద్యార్థులు పాల్గొన్నారు.
లింగపాలెం: ధర్మాజీగూడెం, కె.గోకవరం, లింగపాలెం పీహెచ్‌సీల పరిధిలో నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు. డాక్టర్ కృష్ణకిషోర్ మా ట్లాడుతూ 19 ఏళ్ల లోపు వారికి మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. బాలబాలికలకు ఈ మాత్రలు అందజేస్తున్నామన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశాలు, డాక్టర్ యానీప్రీతి, డాక్టర్ ప్రదీప్తి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
టి.నరసాపురం: నులి పురుగు నివారణతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని పీహెచ్‌సీ వైద్యాధికారి జె.కల్పనారాణి తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. నులి పురుగులు వలన అనారోగ్య సమస్యలలో పాటు రక్తహీనత ఏర్పడుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.