కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారు..
ABN , Publish Date - Jun 22 , 2024 | 12:17 AM
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కొంతమంది ఉద్యోగు లను ఖాళీగా కూర్చోబెట్టి ఏ పని చేయించుకోకుండా ఏళ్ల తరబడి జీతాలు ఇస్తున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు.
అంబులెన్సులు తిరగకుండానే డీజిల్ సొమ్ము డ్రా
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఇదో మాయాజాలం
ఏలూరు క్రైం, జూన్ 21 : ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కొంతమంది ఉద్యోగు లను ఖాళీగా కూర్చోబెట్టి ఏ పని చేయించుకోకుండా ఏళ్ల తరబడి జీతాలు ఇస్తున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. సాధా రణంగా వర్క్ అడ్జెట్‌మెంట్ అంటూ ఖాళీగా ఉన్న ఉద్యోగు లను వేరే పనులకు తాత్కాలికంగా వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం తాము ఏపని చేయమని తమకు ఇచ్చిన డ్యూటీ మాత్రమే చేస్తామని భీష్మించుకుని కూర్చోవడంతో అధికారులే అవాక్కవుతున్నారని తెలుస్తోంది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్సులు డ్రైవర్లుగా ఐదుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ట్రామాకేర్ విభాగానికి చెందిన ఇద్దరు డ్రైవర్లు, కంటి విభాగానికి చెందిన ఒకరు, బ్లడ్ బ్యాంక్ విభాగానికి చెందిన ఇద్దరు ఉన్నారు. బ్లడ్ బ్యాంక్‌కు సంబంధించి స్టోరేజీ వాహనం, మరో అంబులెన్సు ఉంది. ఆసుపత్రికి సంబంధించి గవర్నమెంటు అంబులెన్సు ఒకటి ఉంది. గుప్తా ఫౌండేషన్ ద్వారా అందజేసి అంబులెన్సు మరొ కటి ఉంది. కంటి విభాగానికి సంబంధించి ఇంకో అంబు లెన్సు ఉంది. ప్రస్తుతం కంటి విభాగం అంబులెన్సు మరమ్మ తులో ఉంది. మిగిలిన అంబులెన్సులు పనిచేస్తున్న వాటి వినియోగం లేదు. వీవీఐపీల పర్యటన సందర్భంగా మాత్రమే ఏదోఒక అంబులెన్సును వినియోగిస్తున్నారు. ట్రామాకేర్ అంబులెన్సు దానికి సంబంధించిన డ్రైవర్లు జాతీయ రహదారిపై ఏ మైనా ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని ట్రామా సెంట ర్‌కు తీసుకురావడం, మెరుగైన చికిత్స నిమిత్తం ఉన్నత ఆసుపత్రులకు పేషెంట్లను ఉచితంగా తీసుకువెళ్ళాలి. ట్రామా కేర్‌కు సంబంధించిన నిధులు అన్ని కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. పదవ నెంబర్ జాతీయ రహదారిపై మన రాష్ట్రంలో 9 ట్రామా కేర్ సెంటర్లను
ఏర్పాటు చేయగా జిల్లాకు సంబం ధించి ఏలూరు ప్రభుత్వాసుపత్రిని ఈ సెంట ర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న అంబులెన్సు జాతీయ రహదారిపై నుంచి ఒక క్షతగాత్రుడిని కూడా ఏనాడూ తీసుకొచ్చిన ఘటనలు లేనేలేవు. రిఫరల్ మాత్రం విజయవాడ, గుంటూరుకు తీసుకువెళ్ళేవారు. ప్రస్తుతం ఏడాది నుంచి ఈ వాహనాన్ని మూలనపెట్టేశారు. బ్లడ్ బ్యాంక్‌నకు సంబంధించి వాహనాలు క్యాంపులకు వెళ్తూ ఉంటాయి. కంటి విభాగానికి సంబంధించి ఉన్న డ్రైవర్ నెలకు రెండు క్యాంపులను నిర్వహిస్తూ ఉంటారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
ప్రభుత్వ అంబులెన్సు, ట్రామాకేర్‌కు సంబంధించిన డ్రైవర్లు వారికి అత్యవసర విభాగ సమీపంలో కేటాయించిన రెస్ట్‌రూములో స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారని ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందాయి. ఎప్పుడు చూసినా ఆ రూములో గుంపులు గుంపులుగానే ఉంటారని చెప్తున్నారు. అంబులెన్సులు మరమ్మతులు చేయిస్తే వాటిని వెంటనే మరమ్మతులు వచ్చే విధంగానే చేస్తున్నారనే విమర్శ లు ఉన్నాయి. కొంత కాలం నుంచి అక్కడ ఉన్న డ్రైవర్స్ కాలక్షేపం చేస్తున్నారని వారిని వేరే విధుల్లో వినియోగించుకో వడానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రిలో సిబ్బంది కొరతతో సతమతమవు తూనే ఉన్నారు. ఉన్న వారిపైనే భారం పడుతూనే ఉంది. కనీసం ఓపీల క్యూ వద్ద సిబ్బందే ఉండడం లేదు. వారిని ఇలాంటి పనులకైనా వినియోగించుకునే వెసులు బాటు (వర్క్‌అడ్జెట్‌మెంట్) ఉన్నప్పటికీ ఆ చర్యలు ఏమీ తీసుకోలేద నే విమర్శలు ఉన్నాయి. మెడికల్ కాలేజీకి రెండు ప్రత్యేక ఏసీ బస్సులు వచ్చాయి. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణ లో హాస్టల్‌లో ఉన్న మెడికోలను డీఎంహెచ్‌వో కార్యాలయం లో ఉన్న మెడికల్ కాలేజీకి ప్రతి రోజు తీసుకువెళ్ళి తీసుకురావడానికి ప్రతి రోజు ఈ బస్సులను ఉపయోగిస్తు న్నారు. దీనికి ఇద్దరు డ్రైవర్లను అదనంగా నియమించుకు న్నారు. వాస్తవానికి మెడికల్ కాలేజీ, ప్రభుత్వాసుపత్రి ఒకే విభాగానికి సంబంధించినవే ఇక్కడ డ్రైవర్లను వినియోగించు కోవచ్చు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. మరో విశేషం ఏమిటంటే అంబులెన్సు తిరుగకుండానే యఽథావిధిగా డీజిల్ బిల్లులు డ్రా చేస్తున్నట్టు సమాచారం. లాక్ బుక్‌ను, వాహన కిలోమీటర్లను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని చెబుతు న్నారు. మొత్తం మీద ఉన్నతాధికారులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ దృష్టి సారించి ప్రక్షాళన చేయాల్సి ఉంది.