కొల్లేరు కబ్జాలపై కన్నెర్ర
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:19 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో కొల్లేరు అభయారణ్యంలో ఇష్టానుసారంగా తవ్విన చేపల చెరువులను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేస్తున్నారు.
అక్రమ చేపల చెరువుల గట్లకు గండ్లు
ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న కొల్లేరు గ్రామాల పెద్దలు
గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అభయారణ్యంలో తవ్వకాలు
సుప్రీంకోర్టు నివేదిక కోరడంతో రంగంలోకి అటవీ అధికారులు
వైసీపీ ప్రభుత్వ హయాంలో కొల్లేరు అభయారణ్యంలో ఇష్టానుసారంగా తవ్విన చేపల చెరువులను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేస్తున్నారు. సాధికారిక కమిటీ పరిధిలో ఉన్న కొల్లేరు సరస్సులో ఐదేళ్లల్లో పర్యావరణ పరిరక్షణకు ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. పైగా వేలాది ఎకరాల్లో అక్రమంగా చేపల చెరువులు తవ్వేశారు. దీనిపై సుప్రీం కోర్టులో మృత్యుంజయరావు అనే వ్యక్తి కేసు వేశారు. దీనిపై సుప్రీంకోర్టు కొల్లేరు ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడంతో అటవీ శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది.
కైకలూరు/ఏలూరు రూరల్/పెదపాడు/ భీమడోలు/ఆకివీడు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో కొల్లేరు గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ చేపల చెరువులు తవ్వకాలు చేశారు. ఇప్పుడు ఆ చెరువులకు గండ్లు పెట్టేందుకు అటవీ శాఖ అధికా రులు సన్నద్దం కావడంతో ఆయా గ్రామాల పెద్దలకు లీజు తీసుకున్న వారికి మింగుడుపడడం లేదు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆకివీడు, పైడి చింతపాడు, యాగినమిల్లి, దెందులూరు, పెదపాడు, నిడమర్రు మండలాల్లో 200 ఎకరాలకు పైబడిన ఒక్కో చెరువులను అప్పుడు నేతల కనుసన్నల్లో తవ్వేశారు. కైకలూరు, మండవల్లి మండలాల్లో కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన గట్లు స్థానంలో తాత్కాలికంగా అడ్డుకట్లు వేసిన వాటిని తొలగించేందుకు అటవీ శాఖ అధికారులు
ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆకివీడు, పెదపా డు, ఏలూరు రూరల్ మండలాల్లో చెరువులకు గండ్లు పెట్టారు. దీంతో కొల్లేరు గ్రామాల్లో అల జడి నెలకొంది. ప్రజల్లో ఇప్పటి వరకు అక్రమం గా సాగు చేసిన చేపల చెరువుల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఆయా గ్రామ ప్రజలు గ్రామ కట్టు బాట్ల మధ్య వాటాలు పంపకాలు చేసుకుంటా రు. గట్లు ధ్వంసంతో ప్రజా ప్రతినిధుల వద్దకు పెద్దలు పరుగులు తీస్తున్నారు. అక్రమంగా కొల్లేరులో తవ్విన చేపల చెరువులను ఎకరం రూ.లక్ష లీజుకు బడాబాబులకు అప్పగించారు. వారికున్న ఆర్థిక, అధికార అంగబలాలతో గట్లు ధ్వంసం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ముందుగా ప్రభుత్వ భూమిలోని అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయాల్సి రావడంతో అటవీ శాఖ అధికా రులు చర్యలు చేపడుతున్నారు.
మండలాల వారీగా ధ్వంసం
ఏలూరు రూరల్ మండల పరిధిలో 3,500కు పైగానే అక్రమ చేపల చెరువులు తవ్వకం సాగి నట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా ఏలూరు రేంజ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు గుటు చప్పుడు కాకుండా పెదయాగినమిల్లి 40, లింగా రావుగూడెం 20, కోమటిలంకలో 90, చాటపర్రు లో 40 ఎకరాల్లోని గట్లు ధ్వంసం చేశారు. పెదపాడు మండలం జయపురం సమీపంలోని కొల్లేరు భూముల్లో 50 ఎకరాల అక్రమ చేపల చెరువులను గుర్తించారు. వాటిల్లో 30 ఎకరాల్లోని చేపల చెరువుగట్లను తొలగించినట్లు మత్స్యశాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. పెద్ద విస్తీర్ణంలో వున్న ప్రభుత్వ భూముల్లో చెరువులను తొలగించామని విస్తీర్ణం తక్కువున్న చెరువులను త్వరలో తొలగి స్తామన్నారు. మూడు రోజులుగా భీమడోలు మండలంలోని ఎనిమిది చెరువులకు అధికారులు గండ్లు కొట్టారు. మరో ఐదు చెరువులను ధ్వంసం చేయనున్నట్టు సమాచారం. ఉంగుటూరు నియో జకవర్గ కొల్లేరు గ్రామాల్లో నాలుగు వేల ఎకరా ల్లోని అక్రమ చెరువులను ధ్వంసం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై అటవీ శాఖ అధికారులు సమాచారాన్ని దాటవేస్తున్నారు. నిడమర్రు మం డలంలోను పలు చేపల చెరువులకు గండ్లు కొట్టారు. ఆకివీడు మండలం పెదకాపవరం, చినకాపవరం, చినిమిల్లిపాడు ప్రాంతాల్లో కాంటూరు పరిధిలో ఆక్వా సాగు ఎక్కువగా సాగవుతున్నది. త్వరలో ఇక్కడ అక్రమ చెరువులను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.