Share News

CM Chandrababu: నేను అన్ని డెడ్‌లైన్లు పూర్తి చేశా.. కానీ విధి డెడ్‌లైన్‌ మార్చింది

ABN , Publish Date - Dec 16 , 2024 | 03:42 PM

Telangana: పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అన్నారు. గొల్లపల్లి, బనకచర్లకు మూడు దశల్లో అనుసంధానం చేయవచ్చన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా రాష్ట్రానికి నీటి సమస్య ఉండదని తెలిపారు. చైనాలో ఉండే త్రీ జార్జెస్ డ్యాం కంటే పోలవరం ఎత్తయిన ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు.

CM Chandrababu: నేను అన్ని డెడ్‌లైన్లు పూర్తి చేశా.. కానీ విధి డెడ్‌లైన్‌ మార్చింది
CM Chandrababu Naidu

ఏలూరు, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పోలవరం, అమరావతి రెండు కళ్లు అని.. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన సీఎం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందన్నారు. గొల్లపల్లి, బనకచర్లకు మూడు దశల్లో అనుసంధానం చేయవచ్చన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా రాష్ట్రానికి నీటి సమస్య ఉండదని తెలిపారు. చైనాలో ఉండే త్రీ జార్జెస్ డ్యాం కంటే పోలవరం ఎత్తయిన ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు. 2014లో తెలంగాణాలోని ఏడు మండలాలు ఇస్తేనే ప్రమాణం చేస్తానంటే, కేంద్రం ఆ మండలాలను విలీనం చేశారని తెలిపారు.

chand-polavaram.jpg

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు గాయాలు..


72శాతం పనులు పూర్తి.. అంతలోనే

అప్పట్లో డయాఫ్రం వాల్‌ను460 కోట్లతో బావర్ సంస్థ నిర్మించిందని.. మొత్తం మీద 72 శాతం పనులు చేశామన్నారు. 30 సార్లు పోలవరం వచ్చానని.. అలాగే 80 సార్లు వర్చువల్‌గా రివ్యూ చేసినట్లు తెలిపారు. అటువంటి ప్రాజెక్టును వైసీపీ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటి కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చి బయటకు పంపేశారని.. అప్పటి కాంట్రాక్టర్‌ను మార్చి రాటిఫికేషన్‌కు పంపించారు దుర్మార్గులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అవినీతి, కుట్ర, అనుభవరాహిత్యం వలన అంతా నాశనం చేశారన్నారు.

chand-polavaram1.jpg


ప్రణాళిక సిద్ధం...

2020లో కాపర్ డ్యాం గ్యాప్‌ను కట్టకపోవడంతో వరద వలన డయాఫ్రం వాల్ దెబ్బతిందని.. ఇప్పుడు డీ వాల్ కట్టాలంటే రూ.2400 కోట్లు అదనంగా అవుతుందన్నారు. రూ.440 కోట్లు అప్పటి డి వాల్‌కు అయ్యిందని.. కేంద్రం పోలవరంకు ఇచ్చిన నిధులను మళ్ళించారన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సివిల్ వర్క్స్ 71.3 శాతం తాము చేస్తే, వారు కేవలం 3.5 శాతం మాత్రమే చేశారని వెల్లడించారు. రూ.12,150 కోట్లను మొదటిదశ గా కేంద్రం మంజూరు చేసిందని.. రూ.2150 కోట్లు నిధులను విడుదల చేశారన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని.. పనులను వేగవంతం చేయనున్నామన్నారు.

chand-polavaram2.jpg


2026 అక్టోబర్ నాటికి...

‘‘వచ్చే ఏడాది జనవరి 2 న డయాఫ్రం వాల్ పనులు ప్రారంభిస్తాం.. 2026 మార్చి నాటికి పూర్తవుతాయని అధుకారులు అంటున్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాలి అని అంటున్నా.. 2027 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు. ఇంకా ముందే పూర్తి చేయాలని అధికారులకు చెప్పా. 2026 నాటికి నీటిని నిల్వ చేసే పరిస్థితి రావాలని అంటున్నాను. ఆర్‌అండ్ఆర్ ప్యాకేజ్‌ను 2026 నాటికి పూర్తి చేస్తాం. ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నదుల అనుసంధానం జరగాల్సి ఉంది. ఇతర రాష్ట్రాలతో కొంత వివాదాలు ఉన్నాయి.. వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

chand-polavaram3.jpg


రెండు దశల్లో ఆర్‌అండ్ఆర్ ప్యాకేజ్

‘‘మంచి చేసే వారితో పాటు చెడు చేసేవారిని గుర్తుంచుకోవాలి. విధ్వంసం చేశారు.. చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. 2019తరువాత కూడా టీడీపీ అధికారంలో ఉంటే 2021నాటికు ప్రాజెక్టు పూర్తయ్యేది. ఒక వ్యక్తి మూర్ఖత్వానికి , రాక్షసత్వానికి ప్రాజెక్టు బలయ్యింది. నాశనం చేసిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను దేవుడు నాకు అప్పగించింది. అయిదేళ్ల కాలంలో ప్రాజెక్టు పనులు చేయకపోవడం వలన రూ.15 వేల కోట్ల వరకు నష్టం వచ్చి ఉంటుంది. ప్రాజెక్టు పూర్తయితే, ఆ లాభం కూడా వచ్చి ఉండేది. అది కూడా నష్టపోయారు. హైదరాబాద్ ఆదాయం వలన సరాసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో మొదట స్థానంలో ఉంది. పోలవరం, అమరావతి రెండు కళ్లను పొడిచేసి, నాశనం చేశారు. ప్రజలు వారికి శిక్ష విధించారు. 11 సీట్లు ఇచ్చారు.. కాని నష్టపోయిన దానిని రికవరీచేయలేం. రాష్ట్రంలో గత ఆరునెలలుగా బూతులు లేవు . అంతకుముందు ప్రతీ రోజు బూతులు మాట్లాడేవారు. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే వినిపిస్తున్నాయి. వాటిని కట్టడి చేయగలిగాం కానీ, నష్టాన్ని భర్తీ చేయలేకపోతున్నాం. పోలవరం ప్రాజెక్టుకు నేను ఇచ్చిన అన్ని డెడ్ లైన్లను పూర్తిచేశాం. ఒక్కొక్కసారి విధి డెడ్ లైన్‌ను మార్చుతుంది. ఆర్‌అండ్ఆర్ ప్యాకేజ్‌ను రెండు దశల్లో పూర్తి చేస్తాం. మొదటి దశలో 41.15మీటర్ల ఎత్తులో ముంపుకు గురయ్యే నిర్వాసితులకు, రెండవ దశలో 45.75మీటర్ల ఎత్తులో ముంపుకు గురయ్యే నిర్వాసితులకు పూర్తి చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరంలో పర్యటన ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు తిరిగి అమరావతి సెక్రటేరియట్‌కు బయలుదేరి వెళ్లారు.

chand-polavaram4.jpg

chand-polavaram5.jpg

Updated Date - Dec 16 , 2024 | 04:41 PM