ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తాం
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:16 AM
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ జోన్ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు చెప్పారు.
విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు క్రైం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ జోన్ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు చెప్పారు. విజయవాడ జోనల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారిగా ఏలూ రు కొత్తబస్టాండ్‌ను గురువారం ఆయన పరిశీ లించి ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడా రు. బస్టాండ్‌లలో టాయిలెట్స్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉందని, వాటిని మెరుగుపరు స్తామన్నారు. ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకా నిక్‌లు ఇతర ఉద్యోగాలు 7200 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. తక్కువ చార్జీతో ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని అందించేది ఆర్టీసీ అన్నా రు. త్వరలోనే ఏలూరు డిపో నుంచి తిరుపతికి స్లీపర్ కోచ్ బస్సులను రెండు సర్వీసులు నడప డానికి చర్యలు తీసుకుంటున్నామని, ఏలూరు నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు మరో సర్వీ సు నడపడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వేంకటే శ్వరస్వామి పుణ్యక్షేత్రానికి ఇప్పటికే వంద బస్సుల ను తిప్పుతున్నామన్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడ నుంచి 20, ఏలూరు నుంచి 10, భీమవరం నుంచి 10, తూర్పుగోదావరి జిల్లా నుంచి 60 బస్సులను నడుపుతున్నామన్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులను పెంచనున్నా మన్నారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాలకు అదనపు సర్వీసులను నిర్వహిస్తున్నామన్నారు. ఏలూరు నుంచి జనవరి 9న 21 సర్వీసులు, 10న 30 సర్వీసులు, 11న 30 సర్వీసులు, 12న 30 సర్వీసులు, 13న 6 సర్వీసు లను మొత్తం 117 బస్సులను హైదరాబాద్ నుంచి ఏలూరుకు నడుపుతున్నామన్నారు. ఏలూ రు నుంచి తిరుగు ప్రయాణానికి 15న 10 బస్సు లు, 16న 15 బస్సులు, 17న 8, 18న 20, 19న 30, 20న 10 బస్సులు మొత్తం 93 బస్సులను నడుపుతున్నామన్నారు. ప్రజల అవసరానికి అను గుణంగా అద్దె బస్సులను కూడా అదనపు సర్వీసు లుగా వినియోగిస్తామన్నారు.
గత ఐదేళ్లలో ఆర్టీసీ వివక్షకు గురైందని ఆర్టీసీ కార్మికుల ఆశలు అడియాశలు అయ్యాయని, ఆర్టీసీ ఆస్తులను కారు చౌకధరలతో ధారాదత్తం చేశారన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతోపాటు, ఆర్టీసీ ప్రజా రవాణా జిల్లా అధికారి ఎన్‌విఆర్ వర ప్రసాద్, ఏలూరు డిపో మేనేజర్ బి వాణి పలువురు పాల్గొన్నారు.