Share News

అంతర్‌ రాష్ట్ర దొంగ అరెస్టు

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:24 AM

అంతర్‌రాష్ట్ర దొంగను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ చెప్పారు.

అంతర్‌ రాష్ట్ర దొంగ అరెస్టు

రూ.25 లక్షల సొత్తు స్వాధీనం

ఏలూరు క్రైం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అంతర్‌రాష్ట్ర దొంగను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యా లయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ నేరస్తుడి వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 28వ తేదీన జంగా రెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పల్సర్‌ మోటారు సైకిల్‌ అపహరణకు గురి కావ డంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. వారికి వచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టారు. కామవరపుకోట మండలం పాతకొండగూడెం గ్రామానికి చెందిన అంతర్‌ రాష్ట్ర నేరస్తుడు చీకట్ల సతీష్‌ అలియాస్‌ పండును అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి జంగారెడ్డిగూడె ంలో తస్కరించబడిన మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ నెల 2వ తేదీన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాగి పాడు గ్రామంలో ఒక ఇంటిలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి ఇద్దరు మహిళ లను ఇనుపరాడ్‌లతో కొట్టి ఆ ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు నగదు అపహరించు కుపోయారు. ఆ నేరం కూడా చీకట్ల సతీష్‌ చేసినట్లుగా పోలీస్‌ విచారణలో వెల్లడై ంది. అతని నుంచి పల్స్‌ర్‌ మోటారు సైకిల్‌, సాగిపాడులో రోబరీ కేసులో అపహరించబడిన బంగారపు వస్తువు లు మొత్తం నలభైఏడున్నర కాసులు, వెండి వస్తువులు నాలుగు కేజీల 150 గ్రాము లతో పాటు 2,46,150 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 25లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగిందని చెప్పారు. ఈనేరస్తుడిని అరెస్టు చేయ డంలో గణపవరం సీఐ ఎంవి సుభాష్‌, ఏలూరు జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌, జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ షేక్‌ జబీర్‌, ఐడీ పార్టీ ఏఎస్‌ఐ ఎంవఈ సంపత్‌, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఎస్‌కె షాజహాన్‌, ఏలూరు సీసీఎస్‌ కానిస్టేబుళ్ళు నాగరాజు, రజనీ కుమార్‌లు సహకరించారని ఎస్పీ వీరందని అభినందించి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులను ఎస్పీ అందించారు.

Updated Date - Nov 15 , 2024 | 12:25 AM