ఒప్పంద జీవోలను విడుదల చేయాలి
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:09 AM
ఆశావర్కర్ల సమస్యలపై కుటుంబ సంక్షేమ శాఖ అఽధికారులు తొమ్మిది నెలల క్రితం యూనియన్ నాయకులతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్య క్షుడు టి.సత్యనారాయణ డిమాండ్ చేశారు.
పీహెచ్‌సీల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ధర్నా
నరసాపురం రూరల్/మొగల్తూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):ఆశావర్కర్ల సమస్యలపై కుటుంబ సంక్షేమ శాఖ అఽధికారులు తొమ్మిది నెలల క్రితం యూనియన్ నాయకులతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్య క్షుడు టి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం ఎల్‌బీచర్ల పీహెచ్‌సీ వద్ద ఆశా వర్కర్లతో కలిసి ధర్నా చేసి నిరసన తెలిపారు. మృతి చెందిన ఆశా వర్కర్లకు బీమా సదుపా యం కల్పించాలన్నారు. అనంతరం పీహెచ్‌సీ వైద్యురాలు మాధురికి వినతిపత్రం అందించా రు. రత్నకుమారి, విజయకుమారి, మణికుమారి, జయలక్ష్మి , చిన్నాలు పాల్గొన్నారు. మొగల్తూరు మండలం మొగల్తూరులో ఆశా వర్కర్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆసుపత్రి వైద్యురాలు లక్ష్మీపార్వతికి వినతిపత్రం అందించారు.
పెనుగొండ :సిద్ధాంతం ఆరోగ్య కేంద్రం వద్ద పీహెచ్‌ఎన్ వెంకటలక్ష్మికి సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకురాలు కంకిపాటి లక్ష్మీకు మారి, సీఐటీయూ ఉపాఽధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వరరావు, ఆశా వర్కర్‌లు, ఆసుపత్రి ఉద్యోగులు పాల్గొన్నారు.