Share News

కనికట్టు బెల్టు గుట్టు !

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:43 AM

కొత్త మద్యం విధానం అమలులోకి రావడం, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వడం జరిగి రెండు వారాలు గడి చాయో, లేదో అక్కడక్కడ చీకటిమాటున బెల్టు షాపుల్లో విక్రయాలకు తెరతీశారు.

కనికట్టు బెల్టు గుట్టు !

చీకటి మాటున వ్యాపారం

దుకాణంలో కొని.. బయట రూ.20 పెంచి అమ్మకాలు

కొన్నిచోట్లేమో తెరిస్తే తాట తీస్తామంటూ వార్నింగ్‌లు

తెలంగాణ సరిహద్దున ఇంకో సీను

ఎక్సైజ్‌ కంట్లో పడింది 39 బెల్టులే..

కొత్త మద్యం విధానం అమలులోకి రావడం, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వడం జరిగి రెండు వారాలు గడి చాయో, లేదో అక్కడక్కడ చీకటిమాటున బెల్టు షాపుల్లో విక్రయాలకు తెరతీశారు. కొన్ని చోట్ల కొందరి కనుసన్నల్లో సాగు తుండగా మరికొన్ని చోట్ల రిటైల్‌ మద్యం విక్రయానికి కొందరు తెర లేపారు. ఎక్సైజ్‌ అధికారులు కొన్ని చిల్లరమల్లర దుకాణాలపై కేసులు కట్టారు. దీపావళి తర్వాత మద్యం షాపులన్నీ కుదుటపడే అవకాశం ఉండడంతో ఆ తదుపరి బెల్టుషాపులు మరింత పెరిగి అవకాశం ఉంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

కొత్త మద్యం విధానం ప్రకారం జిల్లా వ్యాప్తంగా 144 మద్యం దుకాణాలకు రెండు వారాల క్రితమే డ్రా తీసి దుకాణదారులకు లైసె న్సు ఇచ్చారు. స్వల్ప వ్యవధిలోనే అన్నిచోట్ల విక్ర యాలు ఆరంభమయ్యాయి. అదీకూడా పాత బ్రాండ్‌లు మార్కెట్‌లో అందరూ కోరుకున్నట్టు గానే కనిపించాయి. విక్రయ సమయాలు రాత్రి 10 గంటల వరకు పెంచారు. ఇంకేముంది మద్యం ప్రియులు రెచ్చిపోయారు. ఈ దెబ్బతో జిల్లా వ్యాప్తంగా ఉన్న బార్‌లన్నీ దిగొచ్చి ధరల ను కొంత తగ్గించాయి. వాస్తవానికి ఇదంతా చక్కబెట్టుకోవడానికి ఆయా దుకాణాల కొత్త యజమానులకు పది రోజులే పట్టింది. కాని మద్యం వ్యాపారంలో ఆరితేరిన వారు ధైర్యంగా ముందడుగు వేసినట్టు సమాచారం. చాలాచోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఎక్కడా బెల్టుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మధ్య నే ఒక ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆబ్కారీ శాఖాధి కార, ఇతర అధికారులను పిలిచి మాట్లాడి నియోజకవర్గంలో ఎక్కడా బెల్టు షాపులనేవి కని పించకూడదని తేల్చేశారు. మంత్రి పార్థసారఽథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజక వర్గంలోను బెల్టు గుట్టు ఎక్కడా ఇప్పటివరకు బయటపడలేదు. ఆయా గ్రామాల్లో బడ్డీ కొట్టు లలో బెల్టు వ్యాపారానికి దిగే వారిపై గట్టి నిఘా ఉంచడమే కారణం.

సరిహద్దున తీరే వేరు

తెలంగాణ సరిహద్దున ఉన్న నియోజక వర్గాల్లో సీను ఇంకోరకంగా ఉంది. కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి మండలాల్లో కొన్ని గ్రామాలకు చెందిన వారు దగ్గరలో మద్యం షాపు లేక పొరుగున ఉన్న తెలంగాణ నుంచి తెచ్చుకున్న మద్యంతో ఎంజాయ్‌ చేయడం లేదా వీరే స్వయంగా హద్దు దాటి వెళ్ళి అక్కడే మద్యంలో మునిగిపోవడమో జరుగుతోంది. ఈ కారణంగా కొంతలో కొంత రాష్ట్రానికి వచ్చే మద్యం ఆదాయంలో కొంత గండిపడినట్టే. చింత లపూడిలో ప్రత్యేకించి బెల్టు షాపులు లేక పోయినా కొందరు ధైర్యం చేసి వ్యక్తిగత అమ్మకా లకు దిగుతున్నట్టు సమాచారం. అంటే కేవలం కొద్దిపాటి మద్యాన్ని ఎవరు కోరుకుంటే వారికి చేర్చేందుకు సాహసం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలోను ఇలాంటి పరిస్థి తే. ఏలూరు సిటీలో ఇప్పటికే పూర్తి కట్టడి చేయడంతో బెల్టు కంటే దుకాణాల్లోనే విక్రయా లకు మద్యం ప్రియులు ఎగబడుతున్నారు. కైక లూరు నియోజకవర్గంలోను ఈ తరహా పరిస్థి తులే ఉన్నాయి. అయినప్పటికీ ఇంతకుముందు మాదిరిగా బెల్టు వ్యాపారం ఏదీ ప్రత్యేకించి ఒకరో, ఇద్దరో చేసేవారు. కాని ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఎక్కువ మంది అందుబాటులో ఉన్న మద్యాన్ని కొనుగోలు చేయడం, దానిని రూ.10 నుంచి రూ.20 అదనంగా పెంచి విక్ర యించడం జరుగుతూనే ఉంది. ప్రత్యేకించి ఒకే చోట పెద్ద సంఖ్యలో క్వార్టర్‌, ఫుల్‌ వంటి స్థాయి లో నిల్వ చేసుకుని విక్రయించేందుకు సాహ సించలేకపోతున్నారు. ఈ రెండు వారాల వ్యవఽ దిలో రాజకీయ కక్షపూరితంగా కొందరు అధికా రులకు ఫిర్యాదులు చేశారని, పరిశీలనలో పెద్దగా బయటపడలేదని చెబుతున్నారు.

తగ్గేదేలే..

ఎట్టి పరిస్థితుల్లోను బెల్టు షాపులను ప్రోత్సహించరాదన్న లక్ష్యంలో కొందరు ఉండ గా, కాని ఏడాదిలోనే లక్షల ఫీజులు చెల్లించా ల్సి రావాల్సి ఉన్నందున కొందరు బెల్టును ఆశ్రయించేందుకే సిద్ధపడుతున్నారు. ఎక్సైజ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి వ్యవహారం తేలు స్తామని చెబుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో బెల్టు షాపులు ఉన్నట్టు ఫిర్యా దులు, సమాచారం అందడంతో దాడులు చేసి 40 మందిని అరెస్టు చేశారు. ఆయా దుకా ణాల పై కేసులు పెట్టారు. అంటే ఈలెక్కన మూడో కంటికి తెలియకుండా గుట్టుగానే మద్యం విక్ర యాలు పల్లెల్లో సాగుతున్నట్టు తేలుతోంది. కాని ఎక్సైజ్‌ దాడుల్లో పట్టుబడింది 129 లీటర్లే. ఒక రకంగా చూస్తే జిల్లా వ్యాప్తంగా దీనిని బట్టి ఎక్కడా బెల్టు వ్యాపారమే లేద న్నట్టుగా కనిపిస్తోంది.

అదుపు తప్పితే రూ.ఐదు లక్షల అపరాధ రుసుం..

మద్యం విధానంలో నిబంధనల మేరకే వ్యవహరించాలని, ఎవరైనా అదుపు తప్పి వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని తాజా గా సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏదైనా లైసెన్స్‌ దుకాణం పరిధిలో ఎవరైనా బెల్టు షాపు నిర్వహిస్తున్నట్టు ధ్రువపడితే తొలిసారి గా ఆ లైసెన్స్‌దారుడికి రూ.ఐదు లక్షల అప రాధ రుసుము విధిస్తామని, రెండోసారి నిగ్గు తేలితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. ఈక్రమంలో మద్యం వ్యాపారు లంతా సీఎం ఆదేశాలకు అనుగుణంగా వ్యవ హరిస్తారా, లేదంటే పూర్తి బెల్టుకే తెగబడ తారా అనేది ఇప్పుడు అందరిలోను సందేహం. అంతకంటే మించి కూటమి పక్ష నేతలెవరూ మద్యం వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని ఇంతకుముందే సీఎం హెచ్చరించారు. ఈసారి బెల్టు విషయంలోను అదే కోణంలో హెచ్చరిక ఉంది. జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు ఈ పక్షం రోజుల్లో అనుకున్నం తగా పుంజుకోలేదని సమాచారం.

Updated Date - Oct 31 , 2024 | 12:43 AM