మంటల్లో మోటార్ బైక్
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:05 AM
రహదారిపై వెళ్తున్న ఓ మోటార్‌బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 26: రహదారిపై వెళ్తున్న ఓ మోటార్‌బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సోమవారం కామవరపుకోట మండలం వడ్లపల్లికి చెందిన రామిశెట్టి నరేష్ తన స్నేహితునితో కలసి సొంతపనిపై ద్వారకాతిరుమల వచ్చాడు. పని ముగించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణమవగా గుండుగొలనుకుంట వద్దకు వచ్చేసరికి బండి వెనుక నుంచి పొగ, మంటలు వస్తుండడం గమ నించి బైక్ ఆపి దూరంగా పరుగులు తీశారు. అయితే బైక్ ఉంచి దట్టమైన పొగలతో మంటలు చెలరేగి దగ్ధమైంది. విద్యుత్ సర్క్యూట్ లోపం కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.