Share News

నిరుపయోగమైన స్థలాలు విక్రయిస్తున్నాం

ABN , Publish Date - Jun 16 , 2024 | 12:03 AM

తమ సంస్థలకు చెందిన ఆస్తు ల్లో కొన్ని నిరుపయో గంగా ఉండ డంతో వాటిని ఈ–అక్షన్‌ ద్వారా విక్రయానికి పెట్టామని బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌.శ్రీను (ఏలూరు) తెలిపారు.

నిరుపయోగమైన స్థలాలు విక్రయిస్తున్నాం
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీను తదితరులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీను

పాలకొల్లు అర్బన్‌, జూన్‌ 15 : తమ సంస్థలకు చెందిన ఆస్తు ల్లో కొన్ని నిరుపయో గంగా ఉండ డంతో వాటిని ఈ–అక్షన్‌ ద్వారా విక్రయానికి పెట్టామని బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌.శ్రీను (ఏలూరు) తెలిపారు. స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థకు చెందిన పాలకొల్లులో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సమీపంలో విజయ ఆర్ధో ఆసుపత్రి వెనుక భాగంలో పడమర, దక్షిణం రోడ్లు కలిగిన ఎం.1.03 సెంట్ల స్థలం ఖాళీగా ఉండ టంతో గజం రూ.22 వేలు విలువైన ఆ స్థలాన్ని ఈ–ఆక్షన్‌ ద్వారా ఈనెల 13న బిడ్‌ తెరిచామని, జూలై ఒకటో తేదీ సాయం త్రం మూడు గంటల వరకూ బిడ్‌ను ఆన్‌లైన్‌లో దాఖలు చేసుకోవచ్చ న్నారు. జూలై 2వ తేదీన బిడ్స్‌ ఓపెన్‌ చేస్తామన్నారు. వివరాలకు 94906 44555, 94901 22622, 94235 65008 నంబర్లలో సంప్రదించాలన్నారు. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కేఎన్‌వీజీ సోమయాజులు, డీఈ పి.వెంకటర త్నం, ఎం. వెంకటరత్నం, ఎం మధుబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2024 | 12:03 AM