Share News

ఇల్లు కడదాం..

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:38 AM

భవన నిర్మాణ సామగ్రి ధరలు కనిష్ఠ స్థాయికి చేరాయి.

ఇల్లు కడదాం..

అందుబాటు ధరల్లో నిర్మాణ సామగ్రి

కనిష్ఠ ధరకు సిమెంటు, ఐరన్‌

ఇసుక రైట్‌ రెట్‌ చేరువలో ఇటుక

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ సామగ్రి ధరలు కనిష్ఠ స్థాయికి చేరాయి. పదిహేనేళ్ల క్రితం ఉన్న ధరల తో పోలిస్తే ప్రస్తుతం సిమెంట్‌, ఐరన్‌ ధరలు కూడా అదేస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. నిన్నటి వరకూ అందని ద్రాక్షగా మారిన ఇసుక ప్రస్తుతం అందరికీ అందే పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్యులు సొంత ఇంటి కల తీరే అవకాశాలు కనబడుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి అనువుగా ప్రస్తుత మార్కెట్‌ ధరలు అందుబా టులోకి వచ్చినట్టయింది. ఒక పక్క ఇసుక, సిమెంట్‌, ఐరెన్‌తోపాటు ఇటుక, మెటల్‌, తదితర ధరలు కూడా దిగివచ్చాయి. దీనితో రెండున్న రేళ్లుగా నిర్జీవంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రం కూడా ఊపందుకున్నాయని రియల్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పదిహేనేళ్ల కనిష్ఠ స్థాయికి సిమెంటు

ఇంటి నిర్మాణానికి సిమెంట్‌ ప్రధానం. సిమెంట్‌ ధరలు ప్రస్తుతం పదిహేనేళ్ల క్రితం పలికిన ధరల స్థాయికి వచ్చాయని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. తాజాగా మార్కెట్‌లో సిమెంట్‌ ధరలు రూ.240 నుంచి 280 వరకూ వాటి గ్రేడ్స్‌, కంపెనీలను బట్టి ధరలు పలుకుతున్నాయి. గతంలో రూ.350 నుంచి 400 వరకూ విక్రయిం చేవారు. ప్రస్తుతం నిర్మాణాలు కొంత మందకొ డిగా ఉండడంతో కనిష్ఠ ధరలు పలుకుతు న్నాయని వ్యాపారులు భావిస్తున్నారు.

ఐరన్‌ టన్ను రూ.58 వేలు

గతంలో ఐరన్‌ టన్ను రూ.85 వేల ధర ఉండగా ప్రస్తుతం కనిష్ఠ ధరకు దిగివచ్చాయి. కంపెనీలను బట్టి బేసిక్‌ ఐరన్‌ ధర రూ.58 వేల నుంచి 65 వేలు పలుకుతోంది. ఇప్పటి వరకూ రెండేళ్లలో ఇదే కనిష్ఠ ధర అని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరలు మరికొన్ని నెలలు నిలకడగా ఉంటాయని భావిస్తున్నారు.

ఇటుకలు కూడా..

సిమెంటు ఇటుకలు, మట్టి ఇటుకల వరకూ అన్నింటి ధర తక్కువగా ఉంది. గతంలో సిమెంటు ఇటుక ఒక్కొటి రూ.24 ధర కాగా ప్రస్తుతం రూ.20, రూ.8 పలికిన మట్టి ఇటుక ప్రస్తుతం రూ.6 చొప్పున అమ్ముతున్నారు. దీంతో ఇటు సిమెంటు, ఐరన్‌తోపాటు ఇటుక కూడా అందుబాటులో ఉన్నట్టే.

నిలకడగా మెటల్‌

అత్యంత అరుదుగా లభించే నల్ల మెటల్‌ ధరలు గతంతో పోలిస్తే తగ్గినా వాటి ధర నిలకడగానే అందుతోంది. ఆ మెటల్‌ ధరలు రూ.7వేల నుంచి 9 వేల వరకూ 3యూనిట్‌ల లారీ ఽధర అందిస్తున్నారు.

ఇసుక రైట్‌ రైట్‌..

నిన్నటి వరకూ ఇసుక కోసం ఎదురు చూసి న నిర్మాణదారులకు ప్రస్తుతం ఇసుక సులువుగా అందించే ఏర్పాటు చేస్తుండడంతో నిర్మాణాల్లో ఊపు పెరిగింది. ప్రస్తుతం 3 నుంచి 5 యూ నిట్‌ల లారీలు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం ర్యాంపుల నుంచి ఇసుక పొందే వెసులుబాటు ఇవ్వడంతో ప్రస్తుతం ఇసుక కిరాయితో కలిపి 3యూనిట్‌లు రూ.8 వేలకు, 5 యూనిట్‌లు రూ.13 వేలకు బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

నిర్మాణం ఊపందుకుంటుంది

నిన్నటి వరకు ఇసుక లేక నిర్మాణాలు మందకొ డిగా సాగాయి. ప్రస్తుతం ఇసుక, నిర్మాణ సామగ్రి ధరలు అందుబాటులో ఉండడంతో పనులు ఊపందుకుంటాయి. ఈ ధరలు ఇలానే కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ఉప్పులూరి మధు, మేస్త్రీ, తాడేపల్లిగూడెం

ఆనందంగా ఉంది..

ఇంటినిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం ధరలు అందుబాటులో ఉండటంతో నేను ఇల్లు కట్టగలననే భరోసా కలిగింది. ఈ ధరలకు ఇంటినిర్మాణం చేపట్టి సొంతింటి కలను నెరవేర్చుకుంటాను.

ఎం.త్రిమూర్తులు, నిర్మాణదారు తాడేపల్లిగూడెం

Updated Date - Dec 03 , 2024 | 12:38 AM