Share News

సమస్యల వెల్లువ

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:53 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించా లని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అధికారులను ఆదే శించారు.

 సమస్యల వెల్లువ

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూడదు : కలెక్టర్‌ నాగరాణి

భీమవరం టౌన్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించా లని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అధికారులను ఆదే శించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ప్రజల నుంచి 157 అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల్లో కొన్ని.. నాకు ఇద్దరు కుమా రులు, ఒక కుమార్తె. 20 ఏళ్ల క్రితం భర్త చనిపో యారు. వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల చేప ల చెరువు, 182 గజాల స్థలాన్ని కొడుకులు, కోడళ్లు మాయమాటలు చెప్పి వారి పేరున రిజిస్ర్టేషన్‌ చేసు కున్నారు. చిత్రహింసలు పెడుతూ ఇంటి నుంచి గెం టేశారు. కుమార్తె వద్ద తల దాచుకుంటున్నా. ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. న్యాయం చేయండి’ అంటూ భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన 68 ఏళ్ల రామాయణం నాగమణి ఫిర్యాదు చేశారు. ‘గత ప్రభుత్వ హయాంలో డ్రోన్‌ ద్వారా చేసిన సర్వేలో నా 89 సెంట్ల భూమిని 88 సెంట్లు ఉన్నట్టు చూపిం చారు. సరిహద్దు భూముల్లో రీసర్వే చేసి నా భూమి నాకు ఇప్పించాలి’ అని వీరవాసరం మండలం తోకల పూడికి చెందిన వీరవల్లి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో ప్రభుత్వానికి చెందిన పోరంబోకు భూమి ఆక్రమణలకు గురవుతోంది.. చర్యలు తీసుకోవాలని పాలకొల్లు మండలం భగ్గేశ్వరంకు చెందిన కుక్కల సూర్యకుమారి ఫిర్యాదు చేశా రు. పంట బొదేను ఆక్రమించుకుని సాగు నీరు రాకుండా చేస్తున్నారు.. చర్యలు తీసుకోవాలని ఆచంట మండలం భీమలాపురానికి చెందిన దేవి సత్యనారాయణ ఫిర్యాదుచేశారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వై.దోసి రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్‌ కేసీహెచ్‌ అప్పారావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ప్రజా ఫిర్యాదులు పరిష్కరించాలి : ఎస్పీ

భీమవరం క్రైం : కుటుంబ కలహాలు, సైబర్‌ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్‌, ప్రేమ పేరిట మోసాలు తదితర సమస్యలపై పలువురు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మికి సోమవారం ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో మాట్లాడి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులను పరిశీలించి, చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్‌) వి.భీమారావు, జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.పుల్లారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2024 | 12:53 AM