నిధులివ్వలేం
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:40 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు పట్టణాలకు ఆనుకుని వున్న 17 గ్రామాలను విలీనం చేశారు.
భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల్లో నిలిచిపోనున్న అభివృద్ధి
గ్రామాల విలీనంతో కోర్టుల్లో కేసుల కారణంగానే.. ఆగిన ఎన్నికల ప్రక్రియ
ప్రభుత్వస్థాయిలో తర్జనభర్జన
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు పట్టణాలకు ఆనుకుని వున్న 17 గ్రామాలను విలీనం చేశారు. ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ఆయా గ్రామాల ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో స్టే విధించింది. ఫలితంగా ఎన్నికలు జరగలేదు. ఇదే ఇప్పుడు మునిసిపాలిటీలకు శాపంగా మారింది. పాలకవర్గాలు లేని కారణంగా ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడం లేదు. అభివృద్ధి నిలిచిపోనుంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రాష్ట్రవ్యాప్తంగా 30 మున్సిపాలిటీలకు ఇలా ఎన్నికలు లేకపోవడంతో పాలకవర్గాలు లేవు. వీటి లో జిల్లాలో నాలుగు పట్టణాలు ఉన్నాయి. కేం ద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావాలంటే పాలకవర్గాలు ఉండాలి. ఇప్పటి వరకు నిధులు విడుదలవుతూ వచ్చాయి. ఇకపై నిధులు నిలిచి పోనున్నాయి. ఇదే విషయమై మున్సిపాలి టీలు ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులతోనే మున్సిపాలిటీలు అభివృద్ధి పనులు చేస్తుంటాయి. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి అవసరాల కోసం నిధులు వెచ్చిస్తాయి. రహదారు లను నిర్మిస్తాయి. ప్రతి మున్సిపాలిటీకి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నిధులు కేటా యిస్తారు. దీంతో మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రభుత్వస్థాయిలో తర్జనభర్జన పడుతున్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోంది. వైసీపీ హయాంలో నిధు లు దుర్వినియోగమయ్యాయి. ప్రాధాన్యతలను విస్మరించి కంకర రహదారులు వేశారు. తాడేపల్లి గూడెంలో ఇటువంటి పనులు నిర్వహిస్తే.. ఇతర పురపాలక సంఘాల్లో తమకు నచ్చిన రీతిలో పనులు చేపట్టారు. మొత్తంపైన పాలక వర్గాలు లేనిలోటు స్పష్టంగా కనిపించింది.
ప్రయత్నాలు వృథా...
విలీన గ్రామాల రికార్డులను స్వాధీనం చేసుకో వాలని గతంలో జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. రికార్డులు స్వాధీనానికి మున్సిపల్ అధి కారులు నోటీసులు జారీచేశారు. వీటి ఆధారంగా గ్రామస్తులు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రికార్డుల స్వాధీనాన్ని హైకోర్టు నిలుపుదల చేయ డంతో గ్రామాల విలీనానికి బ్రేక్ పడింది.
మెప్మా పరిధిలో మహిళా సంఘాలు
గ్రామాలు విలీనం నిలిచిపోయినా జిల్లాలో మున్సిపాలిటీలకు ఆనుకుని 17 పంచాయతీల్లోని మహిళా సంఘాలను మెప్మాలో కలిపేశారు. వాస్తవానికి గ్రామాల్లోని మహిళా సంఘాలు డీ ఆర్‌డీఏ పరిధిలో ఉంటాయి. పట్టణాల్లోని సం ఘాలు మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. విలీన గ్రామాల్లోని సంఘాలను మెప్మా పరిధిలోకి తెచ్చారు. పన్నుల వసూళ్లు, కార్యదర్శులు, సిబ్బం ది అంతా పంచాయతీలే నిర్వహిస్తూ వస్తున్నా యి. పంచాయతీలుగానే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక్క మహిళా సంఘాలను మాత్రమే పట్టణాల పరిధిలోకి తెచ్చారు. దీనివల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలా విలీనం నిలి చిపోవడంతో ఆర్థిక సంఘం నిధులతోపాటు, పాలనాపరమైన సమస్యలు ఎదురవుతూనే ఉన్నా యి. గ్రామాల ప్రజలు విలీనానికి అంగీకరించడం లేదు. భీమవరం పట్టణాన్ని కార్పొరేషన్ చేసేం దుకు అనుమతి ఇస్తే వీలీనం చేస్తామంటూ రాయలం, చిన అమిరం, అనాకోడేరు, తాడేరు తదితర గ్రామాల నేతలు స్పష్టం చేశారు.
ఎన్నికలకు వెళుతుందా ?
నిధులు నిలిచిపోనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు ఆలోచన చేస్తోంది. అదే జరిగితే పాత వార్డుల ప్రకారమే నిర్వహించాలి. ఆ మేరకు మున్సిపాలిటీలను మళ్లీ కుదించనున్నారు. అప్పు డే ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది. ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తు తం ఒక్క నర్సాపురంలోనే కౌన్సిల్ ఉంది. భీమవ రం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సి పాలిటీల్లో ఇన్‌ఛార్జ్‌ల ఆధ్వర్యంలోనే పాలన సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నారు.
మున్సిపాలిటీ.. విలీన గ్రామాలు
భీమవరం : రాయలం, నరసింహపురం, కొవ్వాడ అన్నవరం, తాడేరు, చిన అమిరం,
తాడేపల్లిగూడెం : కొండ్రుప్రోలు, పడాల, ఎల్.అగ్రహారం, కుంచనపల్లి, ప్రత్తిపాడు,
తణుకు : పైడిపర్రు, వెంకట్రాయపురం, వీరభద్రపురం.
పాలకొల్లు : అడవిపాలెం, ఉలంపర్రు, కొంతేరు, పెంకుళ్లపాడు, పూలపల్లి, భగ్గేశ్వరం, పాలకొల్లు రూరల్ పంచాయతీ.