కారు అద్దెకు తీసుకుని.. తాకట్టు పెట్టేస్తారు
ABN , Publish Date - Nov 26 , 2024 | 12:02 AM
కార్లను అద్దెకు తీసుకుంటారు.. రెండు నెలలు సక్రమంగా అద్దె కట్టేస్తారు. తర్వాత వాటిని గుట్టుచప్పుడు కాకుండా వేరే ప్రాంతంలో తాకట్టు పెట్టేస్తారు.
ఇద్దరి అరెస్ట్
ఆరు కార్లు స్వాధీనం
ఏలూరు క్రైం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కార్లను అద్దెకు తీసుకుంటారు.. రెండు నెలలు సక్రమంగా అద్దె కట్టేస్తారు. తర్వాత వాటిని గుట్టుచప్పుడు కాకుండా వేరే ప్రాంతంలో తాకట్టు పెట్టేస్తారు. కార్లను అద్దెకు ఇచ్చిన వారి ని, తాకట్టు పెట్టుకున్న వారిని తప్పించు కు తిరుగుతారు. బాధితుల ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను ఏలూరు త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ కేసు వివరాలను తెలిపారు. ఏలూరు సత్రంపాడు విద్యావికాస్ వీధికి చెందిన ముం గర అశోక్ తంగెళ్ళమూడిలో నివాసం ఉంటున్నా డు. పత్తేబాదకు చెందిన ఎల్లపు భానుచందర్ తో కలిసి నెలవారీ అద్దెకు కారు కావాలని డ్రైవర్, ఆయిల్ తామే చూసుకుంటామని నమ్మ బలుకుతారు. ఒకటి రెండు నెలలు అద్దె సజావు గా కట్టి తరువాత ఆ కారు వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి తాకట్టు పెట్టేస్తారు. తెలిసిన వ్యక్తి ద్వారా తమ కుమారుడు అనారోగ్యంతో ఉన్నా డని అత్యవసరంగా ఆపరేషన్ చేయాలంటూ రూ.15 లక్షల విలువైన కారును ఐదు లక్షలకు తాకట్టు పెడతారు. రికార్డు తరువాత తీసుకువ స్తామని వెళ్లిపోతారు. కారు అద్దెకు ఇచ్చిన వారు ఎంత కాలం అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతారు. ఏలూరులో ఆరు కార్లను అద్దెకు తీసుకుని తాకట్లు పెట్టేశారు. బాధితులు ఏలూరు రూరల్, టూటౌన్, త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ ఎస్ కోటేశ్వరరావు, ఎస్‌ఐలు ప్రసాద్, రాంబాబు, సిబ్బంది బృందం గా ఏర్పడి నిందితులు ముంగర అభిషేక్, ఎల్లపు భానుచందర్‌ను సోమవారం అరెస్టు చేశారు. తాకట్టుపెట్టిన ఆరు కార్లను గుర్తించి వాటిని కూ డా స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రావణ్‌కు మార్ మాట్లాడుతూ ఎవరైనా వాహనాలను తాకట్లు పెట్టుకోవాలంటే కచ్చితంగా యజమాని, ఒరిజినల్ సీ బుక్, అన్ని చూసుకోవాలన్నారు. మధ్యవర్తులు తాకట్టు పెడితే పెట్టుకున్న వారిపై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దొంగ సొత్తులను ఎవరు కొన్నా తాకట్టు పెట్టుకు న్నా చర్యలు తప్పవన్నారు. విలేకరుల సమావే శంలో డీఎస్పీతో పాటు త్రీ టౌన్ సీఐ ఎస్ కోటేశ్వరరావు, ఎస్‌ఐలు కె.ప్రసాద్, రాంబాబు, ఏఎస్‌ఐ బండారు నాని, కానిస్టేబుల్ నాగరాజు, పలువురు పాల్గొన్నారు.