Share News

వైసీపీ పాలనంతా అరాచకమే

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:12 AM

‘వైసీపీ పాలనంతా అరాచకమే. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. రైతులతోపాటు వివిధ వర్గాల ప్రజల జీవితా లతో చెలగాటం ఆడింది. ప్రాజెక్టులను గాలికి వదిలేసింది. కూటమి అధికా రంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం.

వైసీపీ పాలనంతా అరాచకమే
భీమవరంలో కేకు కట్‌ చేస్తున్న కేంద్ర మంత్రి వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు

కేంద్ర మంత్రి వర్మ విమర్శ

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 20 : ‘వైసీపీ పాలనంతా అరాచకమే. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. రైతులతోపాటు వివిధ వర్గాల ప్రజల జీవితా లతో చెలగాటం ఆడింది. ప్రాజెక్టులను గాలికి వదిలేసింది. కూటమి అధికా రంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. విపత్తులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అన్నదాతకు అండ గా నిలబడ్డాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజానీకానికి ఉపయో గపడేలా చేస్తున్నాం’ అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భీమవరంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ‘గత ప్రభుత్వం ఇరవై ఏళ్లయినా అప్పు తీర్చలేని సంక్షోభంలోకి నెట్టేసింది. కుర్చీలను తాకట్టు పెట్టేసింది. ఇంత సంక్షో భంలోను కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌లు విజన్‌ వున్న నాయకులు’ అని అన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కరపత్రాలను విడుదల చేసి కేక్‌ కట్‌ చేశా రు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందించారు. మునిసిపల్‌ కమిషనర్‌ కె.రా మచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్‌, బండి రమేష్‌కుమార్‌, వబిలిశెట్టి రామకృష్ణ, ఇందుకూరి రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:12 AM