Share News

అవినీతిలో రారాజు

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:43 AM

ఆ గ్రామ కార్యదర్శి వసూలు చేసిన ఆస్తి పన్ను సొమ్మును సొంత ఖాతాలోకి జమ చేసుకున్నాడు. వందో, వెయ్యో కాదు.. అక్షరాలా కోటికి పైమాటే. వైసీపీ హయాంలో జరిగిన ఈ అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

అవినీతిలో రారాజు

కోటి నిధులు సొంత ఖాతాకు..

చినఅమిరం గ్రామ కార్యదర్శి దందా

వైసీపీ హయాంలో అక్రమాలు

భీమవరం విచ్చేసిన అధికారులకు కార్యదర్శిగా కిశోర్‌ రాచమర్యాదలు చేసేవారు. భీమవరంలోని ఖరీదైన హోటల్లో ఓ అధికారికి పది రోజులపాటు వసతి కల్పించి రూ.10 లక్షలు ఖర్చు పెట్టారు. ఇలా వైసీపీ హయాంలో విచ్చలవిడిగా సొమ్ములు ఖర్చు పెట్టారు. పంచాయతీ నిధులను సొంతానికి వాడుకున్నారు. వీటిని జమ చేయాలంటూ ప్రస్తుత కార్యదర్శి హితబోధ చేసినా సరే పెడచెవిన పెట్టారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఆ గ్రామ కార్యదర్శి వసూలు చేసిన ఆస్తి పన్ను సొమ్మును సొంత ఖాతాలోకి జమ చేసుకున్నాడు. వందో, వెయ్యో కాదు.. అక్షరాలా కోటికి పైమాటే. వైసీపీ హయాంలో జరిగిన ఈ అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వైసీపీ నేతల అండదండలలో భీమవరం రూరల్‌ మండలం చిన అమిరం గ్రామ పంచాయతీ అప్పటి గ్రామ కార్యదర్శి కిశోర్‌రాజు చెలరేగిపోయారు. వారికి అడ్డగోలుగా సహకారం అందించారు. గ్రామ పంచాయతీని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టేశారు. పంచాయతీ నుంచి కాంట్రాక్టర్లకు దాదాపు రూ.1.50 కోట్లు బకాయిపడ్డారు. మరోవైపు పెద్ద మొత్తంలో నిధులు గోల్‌మాల్‌ చేశారు. ఇప్పుడవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రాయలం పంచాయతీలో ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ ఆస్తి పన్నును సొంత ఖాతాలోకి జమ చేసుకున్న వ్యవహారంలో కార్యదర్శి కిశోర్‌రాజుపై క్రిమిన ల్‌ కేసు నమోదైంది. అతనిని సస్పెండ్‌ చేయాలంటూ ప్రభుత్వానికి జిల్లా పంచాయతీ అధికారి లేఖ రాశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ ప్రక్రియను పూర్తిచేశారు. అదే తరహాలో చిన అమిరం గ్రామ పంచాయతీలోనూ అక్రమాలు జరిగాయి. ఆస్తి పన్ను పక్కదారి పట్టించారు. కోటికిపైగా సొంత ఖాతాలోకి జమ చేసుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పంచాయతీలో రికార్డుల పరిశీలన, విచారణ ప్రక్రియ పూర్త య్యింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా అధికా రులకు నివేదిక అందనుంది. దానిపైనా చర్యలు తీసుకోనున్నారు.

వైసీపీ నేతలకు జీహుజూర్‌

గత ప్రభుత్వంలో చినఅమిరం పంచాయతీ చేపట్టిన అభివృద్ధి పనులు వైసీపీ నాయకులకే ప్రయోజనం చేకూర్చాయి. సీసీ రహదారులన్నీ వైసీపీ నాయకుల ఇళ్లకు వెళ్లేలా అభివృద్ధి చేశారు. అప్పటి మండల పరిషత్‌ అధ్యక్షునికి సంబంధించిన అనధికార లే అవుట్‌లో ఏకంగా సీసీ రహదారి వేయడంలో కిశోర్‌ పూర్తిగా సహకరించారు. అనుమతులు లేకుండా భవనాలను నిర్మిస్తున్నాసరే పట్టించుకోలేదు. ఈ సహకారం కారణంగా చిన అమిరం పంచాయతీలో కిశోర్‌ అవకతవకలను ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా ఈ వ్యవహారం గుట్టు రట్టు అయ్యింది.

Updated Date - Dec 27 , 2024 | 12:43 AM