కోడి పందేలపై మెరుపుదాడి
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:24 AM
పాత నవరసపురం గ్రామంలో కోడి పందేలపై మొగల్తూరు, నరసాపురం, యల మంచిలి పోలీసులు దాడి చేశారు. 16 మందిని అరెస్టు చేశారు.
తెల్లవారుజామున మూడు మండలాల పోలీసుల జాయింట్ ఆపరేషన్
రూ.3.31లక్షల నగదు, 23 కోళ్లు, 28 బైక్‌లు స్వాధీనం
16 మంది అరెస్టు
నరసాపురం రూరల్, డిసెంబరు 6 (ఆంధ్ర జ్యోతి): పాత నవరసపురం గ్రామంలో కోడి పందేలపై మొగల్తూరు, నరసాపురం, యల మంచిలి పోలీసులు దాడి చేశారు. 16 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.31లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 23 కోళ్లు, 28 బైక్‌లు, కారు, 17 సెల్‌ఫోన్లు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దాడులకు సంబంధించి సర్కిల్ కార్యాలయంలో నరసాపురం, పాలకొల్లు సీఐలు దుర్గాప్రసాద్, జి.శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు మండలాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో నవరసపురం గ్రామంలో శిబిరం నిర్వహిస్తు న్నారన్న సమాచారంతో మెరు పు దాడి చేశామన్నారు. చాలా మంది తప్పించుకుని చీకట్లో పారిపో యారన్నారు. సమావేశంలో ఎస్సై గుర వయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
పందెం నిర్వాహకులు ఎవరు.?
మరోవైపు పోలీసుల మెరుపుదాడి తీర ంలో చర్చనీయాంశమైంది. కొంత కాలంగా నరసాపురం, మొగల్తూరు, కృష్ణా, భీమవరం మండలాల సరిహద్దుల్లో రాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున పందెలు నిర్వహిస్తున్నారన్న వదంతలు షికారు చేస్తున్నాయి. వ్యాన్‌కు ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి వాటి సాయంతో ఎంచుకున్న ప్రదేశాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగానే పందెంరాయుళ్ళకు సమాచారాన్ని తెలియజేస్తున్నారు. రెండు మూడు గంటల పాటు జరిగే ఈ పందాలు లక్షలు చేతులు మారుతున్నాయి. తాజాగా పోలీసుల దాడుల్లో కూడా ఇదే వెలుగుచూసింది. అయితే ఈ పందేనికి నిర్వాహకులు ఎవరన్న దానిపై పలు పేర్లు షికారు చేస్తున్నాయి. కూటమి పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు బంధువు తెర వెనుక ఉండి చట్టవిరుద్ద కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న వాదనలు లేకపోలేదు.