నారికేళం... ధర ఘనం!
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:30 AM
కొబ్బరి మార్కెట్‌కి కార్తీక శోభ వచ్చింది. ఒక వైపు రైతువారీ కొనుగోళ్లు ధర ఆశాజనకంగా ఉండగా మరో వైపు రిటైల్ మార్కెట్‌లో కొబ్బరి ధర దడ పుటిస్తున్నది.
కార్తీకంలో కొబ్బరికి డిమాండ్
వెయ్యి కాయలు రూ.13వేల నుంచి 18 వేలు
పండుగల వేళ పెరిగిన వినియోగం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గరిష్ట ధర
పశ్చిమలోనూ రైతువారీ కొనుగోళ్లు ముమ్మరం
పాలకొల్లు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కొబ్బరి మార్కెట్‌కి కార్తీక శోభ వచ్చింది. ఒక వైపు రైతువారీ కొనుగోళ్లు ధర ఆశాజనకంగా ఉండగా మరో వైపు రిటైల్ మార్కెట్‌లో కొబ్బరి ధర దడ పుటిస్తున్నది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రైతువారీ కొనుగోళ్లు ధర గరిష్టంగా వెయ్యి కాయలు రూ.13వేలు ఉండగా పాత తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి రైతువారీ కొను గోలు ధర వెయ్యి కాయలకి రూ. 16 నుంచి 18వేలు ధర పలుకుతున్నది. కార్తీక మాసం కావ డంతో స్థానికంగానూ కొబ్బరికి డిమాండ్ పెరి గింది. దీంతో రైతులు కాయ తయారు కాకుం డానే దింపు తీస్తున్నారు. కొబ్బరి చెట్లను దింపిన వెంటనే ఎగుమతులు చేసుకోవడంతో కాయ నిలువ ఆగనప్పటికీ నష్టం లేదని వర్తకులు చెబుతున్నారు. తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో అధిక శాతం నీటికాయ (బొండాలు) తీసివేయ డంతో తయారీ కొబ్బరికి డిమాండ్ ఏర్పడింది. సమీప రాష్ర్టాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో దిగుబడి తగ్గడంతో ఆంధ్రా కొబ్బరికి డిమాండ్ పెరిగింది. దశమికి ముందు రైతువారీ కొను గోళ్లులో కొబ్బరి ధర గరిష్టంగా రూ.18వేలుకు చేరగా ఇప్పుడు మరోసారి రైతువారీ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పశ్చిమలో ధరలు తక్కువ ఉన్నప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో నాణ్యతను బట్టి కొబ్బరి అధిక ధరలకు కొనుగోళ్లు చేస్తున్నా రు. పాత కాయ 28సైజు రిటైల్ మార్కెట్‌లో రూ.25 నుంచి 30కి అమ్ముతున్నారు. ఈధరలు కార్తీక మాసాంతం వరకూ స్థిరంగా ఉంటాయని కొబ్బరి మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ క్వాలిటీ (గంఢేరా) పాత కాయలు డిమాండ్ పెరి గింది. పశ్చిమ రాష్ర్టాలలో డిమాండ్ ఉండే నెం బరు(చిన్నవి) కాయలుకు డిమాండ్ పెరిగింది. 70 బత్తీలు 80బత్తీలు సైజు కాయలు దిగుమ తులకు వర్తకులు సిద్ధం చేశారు. తెలంగాణా రాష్ట్రంలోనూ, రాష్రంలోని రాయలసీమ ప్రాంతం లోనూ కార్తీక మాసం సందర్భంగా కొబ్బరి వినియోగం ఘణనీయంగా పెరిగింది. కార్తీక మాసం అనంతరం క్రిస్మస్, సంక్రాంతి పండుగ లను పురస్కరించుకుని వినియోగం పెరుగుతు న్నదున కొబ్బరి మార్కెట్‌కి మరింత ఊతం రావచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా కొబ్బరి రైతులకు పెరిగిన ధర ఊరటనిచ్చింది.