Share News

ఆడుతూ.. పాడుతూ.. ఉల్లాసంగా

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:33 AM

అధికారులంతా ఒక్కసారిగా పిల్లలయ్యారు. కలెక్టర్‌, జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులంతా కొంతసేపు వారి హోదా పక్కన పెట్టి ఉత్సాహంగా ఆటలాడారు.

ఆడుతూ.. పాడుతూ.. ఉల్లాసంగా
వన సమారాధనలో క్రీడా పోటీల్లో తలపడుతున్న కలెక్టర్‌ నాగరాణి, అధికారులు

అధికారుల వన విహారం

భీమవరంటౌన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): అధికారులంతా ఒక్కసారిగా పిల్లలయ్యారు. కలెక్టర్‌, జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులంతా కొంతసేపు వారి హోదా పక్కన పెట్టి ఉత్సాహంగా ఆటలాడారు. పాటలు పాడి అల్లరి చేశారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి ఆశ్రమం ఎదురుగా మామిడి తోటలో శుక్రవారం వన సమారాధన ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, కలెక్టరేట్‌లోని వివిధ శాఖ ల జిల్లా అధికారులు, సిబ్బంది ఆట పాటలతో ఉత్సాహంగా గడిపారు. కలెక్టర్‌ నాగరాణి మా ట్లాడుతూ నిరంతరం పనుల ఒత్తిడిలో సతమ తమయ్యే అధికారులు, సిబ్బందికి వన సమా రాధన మంచి ఆటవిడుపు అన్నారు.

కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో రెండు జట్లుగా వాలీ బాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడి అధికారులు, సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. కలెక్టర్‌ మహి ళా అధికారులు కబడ్డీలో కలబడ్డారు. డ్వామా పిడి కెసిహెచ్‌ అప్పారావు చెప్పిన కార్తీక మాసం విశిష్టత, ఆకివీడు తహసీల్దార్‌ ఫోక్‌ సాంగ్‌, ఆకివీడు మునిసిపల్‌ కమిషనర్‌ పేరడీ సాంగ్‌, మున్సిపల్‌ పాఠశాల టీచర్‌ అమ్మపాట, కలెక్టరేట్‌ సిబ్బంది పాటలతో అందరూ కేరింతలు కొట్టారు. వివిధ ఆటల్లో గెలుపొందిన సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు. విజేతలకు జిల్లా కలెక్టర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, తదితర అధికారులు బహుమతులను అందజేశారు.

Updated Date - Nov 30 , 2024 | 12:33 AM