విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణగా చదువుకోవాలి
ABN , Publish Date - Jul 01 , 2024 | 12:27 AM
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి
పెనుగొండ, జూన్ 30 : విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. ఆదివారం పెనుగొండలోని బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వసతి గృహాన్ని, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతిపై ఆరా తీశారు. విద్యార్థినులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు మంచి వాతావరణంలో చదువుకు నేలా పరిసరాలను తీర్చిదిద్దాలన్నారు. అన్ని విషయాలపై పూర్తి పరిజ్ఞానం కలిగినప్పుడే చదువులో కూడా మరింత రాణించగలరన్నారు. చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వసతి గృహంలో ఏదైనా సమస్య ఉంటే తెలపాలని విద్యార్థులను అడగగా తాగు నీటి సమస్యను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వసతి గృహ ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థినులకు వసతి కల్పించామని, 450 మంది వరకు కెపాసిటీ ఉందని, అడ్మిషన్స్ జరుగుతున్నాయని కలెక్టర్‌కు తెలిపారు. 2+2 మహిళా సెక్యూరిటీ సిబ్బందిని 24 గంటలు గృహంలో ఏర్పాటు చేశామన్నారు. వసతి గృహం నిర్వహణపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు.