కలెక్టరేట్ నుంచి ఏఎంసీకి విముక్తి
ABN , Publish Date - Dec 05 , 2024 | 12:22 AM
భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఏఎంసీ స్థలాన్ని డీనోటిఫై చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతుండగా, కొత్త కలెక్టరేట్ భవనం ఎక్కడ ఏర్పాటు చేస్తారనే చర్చ నడుస్తోంది.
డీనోటిఫై చేసిన కూటమి ప్రభుత్వం
కొత్త స్థలం కోసం తర్జనభర్జనలు
భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఏఎంసీ స్థలాన్ని డీనోటిఫై చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతుండగా, కొత్త కలెక్టరేట్ భవనం ఎక్కడ ఏర్పాటు చేస్తారనే చర్చ నడుస్తోంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి ఏఎంసీ స్థలాన్ని కేటాయించాలని అప్పటి జిల్లా అధికారులు ప్రతిపాదించారు. దీనికి వ్యవసాయ మార్కెటిం గ్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయిన ప్పటికీ స్థలాన్ని కేటాయిస్తూ వైసీపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాధా మ్యాలు మారాయి. ఏఎంసీని వదులుకుంటే కొత్తగా మరోచోట నిర్మించలేమంటూ స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు భావించారు. ఏఎంసీకి భూములు వచ్చే అవకాశం లేదు. రైతులు ఇవ్వడానికి ఆసక్తి చూపరు. పైగా 20 ఎకరాల విస్తీర్ణంలో ఏఎంసీ విస్తరించింది. గోదాములను నిర్మించారు. జిల్లాలోనే అత్యధిక ఆదాయం తెచ్చే ఏఎంసీగా గుర్తింపు పొందింది. అటువం టిది మరోచోట ఏర్పాటుకు అవకాశం లేదు. భవిష్యత్తులో రైతులు రొయ్య ఉత్పత్తులను భద్రపరచుకోవడానికి అవసరమైన శీతల నిల్వ భవనాలను నిర్మించేందుకు ఇక్కడ అవకాశం ఉంది. అది వదులుకుంటే మరోచోట ఏర్పాటు కష్టమన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పున రాలోచన చేసి ఏఎంసీని కలెక్టరేట్‌కు ఇవ్వకూ డదంటూ నిర్ణయించింది. ఆ మేరకు డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇలా భీమవరం ఏఎంసీకి సాంత్వన లభించింది. మార్కెటింగ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కొత్త కలెక్టరేట్ ఎక్కడ
ఏఎంసీ ప్రతిపాదనను విరమించుకోవడంతో కొత్త కలెక్టరేట్ ఎక్కడనే దానిపై చర్చ సాగుతోం ది. పెద అమిరం సమీపంలో నాలుగు ఎకరాల స్థలంలో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిం చాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే కలెక్టరేట్‌తోపాటు, ఇతర జిల్లా కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉంటే ప్రజలకు అనువుగా ఉంటుందన్న చర్చ నడు స్తోంది. ఆ విధంగా నిర్మాణాలు చేపట్టాలంటే కనీసం 12 ఎకరాలు భూమి అవసరం. ఈ ప్రాంతంలో అంతటి ప్రభుత్వ భూమి ఒకేచోట లేదు. రైతుల నుంచి సేకరిం చాలి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలి. భూసేకరణకు నిధులు కేటా యించకపోయినా టీడీఆర్ బాండ్‌లు జారీచేస్తే రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి స్థాయిలో టీడీఆర్ బాండ్‌లపై మార్గదర్శకాలను విడుదల చేసేం దుకు కసరత్తు చేస్తున్నారు. రైతులకు కాస్త లాభసాటి ఉండేలా బాండ్‌లు జారీచేస్తే కలెక్టరేట్‌కు భూసేకరణ సాధ్యపడుతుంది. రిజిస్ర్టేషన్ విలువలో ఒకటికి నాలుగురెట్లు విలువైన బాండ్‌లు జారీ చేస్తారు. మార్కెట్‌లో వాటిని 50 శాతానికి విక్రయించుకునే వెసులు బాటు రైతులకు ఉంటుంది. అంటే రైతుకు రెండు రెట్లు మాత్రమే ధర వస్తుంది. అలా కాకుండా రైతులకు అధిక ధరలు వచ్చేలా బాం డ్‌లు జారీచేసినా సరే ప్రభుత్వానికి నిధులు సమస్య ఉండదు. రైతులు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఉండి నియోజకవర్గ పరిధిలో ఒకే చోట 12 ఎకరాల భూమి ఉందన్న ఆలోచన చేస్తున్నారు. భీమవరానికి సమీపంలోనే కలెక్టరేట్ నిర్మాణం చేపడితేనే జిల్లా ప్రజలకు ప్రయోజనం ఉం టుంది. ఇలా అన్ని కోణాల్లోనూ కొత్త కలెక్టరేట్ కోసం తర్జన భర్జనలు పడుతున్నారు. మొత్తంపైన ఎఎంసికి ఊరట లభించింది. కొత్త కలెక్టరేట్ ప్రతిపాదనలపై మల్లగుల్లాలు పడుతున్నారు.
తాత్కాలిక కలెక్టరేట్‌తో తిప్పలు
తాత్కాలిక నడుస్తున్న కలెక్టరేట్‌కు రవాణా సౌకర్యం లేదు. కలెక్టరేట్ వద్ద రహదారికి ఇబ్బందిగా ఉంది. పట్టణ ప్రాంతంలో కలెక్టరేట్ లేకపోవడంతో మున్సిపాలిటీ రహదారిని నిర్మించడానికి అవకాశం లేదు. వర్షం కురిస్తే కలెక్టరేట్‌కు వెళ్లడానికి ఇబ్బందులు పడుతు న్నారు. ఇటీవల సదరు రహదారిలో సిబ్బంది ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్ర వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోంది. దీంతో వీలైనంత త్వరగా కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించాల్సి ఉంది.