Share News

బీమాతో ధీమా

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:59 AM

వ్యవసాయం జూదంగా మారింది. ప్రకృతి విలయంతో సాగు తీవ్ర ఒడిదుడుకులకు లోనవు తోంది. పెట్టిన పెట్టుబడి వర్షార్పణం అవుతోంది. ఈ క్రమంలో రైతుకు అండగా నిలిచేది బీమా మాత్రమే.

 బీమాతో ధీమా

పంట రుణాలతోపాటు కామన్‌ సర్వీస్‌ సెంటర్లలోనూ కట్టుకోవచ్చు

దాళ్వాలో ఎకరానికి బీమా మొత్తం రూ.41 వేలు.. చెల్లించాల్సిన ప్రీమియం రూ.820..

రైతు వాటా రూ.615.. కేంద్ర,

రాష్ట్ర ప్రభుత్వాల వాటా 205

వైసీపీ హయాంలో కట్టకుండానే కట్టిన డ్రామా.. రైతులకు నష్టం

భీమవరం రూరల్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యో తి): వ్యవసాయం జూదంగా మారింది. ప్రకృతి విలయంతో సాగు తీవ్ర ఒడిదుడుకులకు లోనవు తోంది. పెట్టిన పెట్టుబడి వర్షార్పణం అవుతోంది. ఈ క్రమంలో రైతుకు అండగా నిలిచేది బీమా మాత్రమే. వేసిన ప్రతి పంటకు బీమా చేయిం చుకుంటే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. గత వైసీపీ ప్రభుత్వం పంటలను ముంపు బారిన పడేలా చేయడంతోపాటు పంటల బీమాను అం దించడంలోను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ పరిస్థితి రాకుండా కూటమి ప్రభుత్వం దాళ్వాలో ధీమాలాంటి బీమా పథకాన్ని తీసుకువస్తుంది. రైతే నేరుగా పంటల బీమా ప్రీమియం చెల్లించు కునే వెసులుబాటు కల్పించింది. వ్యవసాయ రుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకులకు ప్రీమి యం చెల్లించవచ్చు. రుణాలు పొందని వారు కామన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా బీమా ప్రీమియం కట్టుకోవచ్చు. ఎకరానికి రూ.41,000 బీమా పొం దేందుకు రెండు శాతం ప్రీమియం చెల్లించాలి. దీనిలో మూడొంతులు రైతులు చెల్లిస్తే.. ఒక వంతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడతాయి. ఈ లెక్కన ఎకరానికి 820 రూపాయలు ప్రీమి యంలో రూ.615 రైతు, రూ.205 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జమవుతుంది. ఈ ప్రీమియం చెల్లింపు గతంలో మాదిరి ఇతర ప్రైవేటు కంపెనీలు కాకుండా అగ్రికల్చరల్‌ ఇన్సురెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియాకు చెల్లిస్తారు. గడువు తేదీ డిసెంబర్‌ 15 రైతులు పంటల బీమా సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని వ్యవసాయాధికారులు, ఆర్‌ఎస్‌కే సిబ్బంది, రంగంలోకి దిగుతున్నారు.

వైసీపీ రైతులను ముంచేసింది

గత వైసీపీ ప్రభుత్వం పంటల బీమా చెల్లింపు లో జోక్యం చేసుకుని ఆదిలోనే రైతులను నడ్డివిరిచింది. బీమా ప్రీమియం చెల్లించేశామని అప్పట్లో చెప్పిన ప్రభుత్వం తుఫాన్‌ కారణంగా పంట దెబ్బ తింటే ప్రీమియం చెల్లించలేదని ఇన్సూరెన్స్‌ కంపెనీలు చేతులెత్తేశాయి. ప్రతిపక్ష పార్టీ రైతులకు ఆసరాగా నిలవడంతో వైసీపీ సొంత సొమ్మును కొంతవరకు రైతులకు పంటల బీమా గా ఇచ్చింది. నష్టపోయిన చాలా మంది రైతులు బీమా సొమ్ము అందక అవస్థలు పడ్డారు. తర్వాత ప్రీమియం చెల్లింపులోను ఎంతమంది రైతులకు ప్రీమియం చెల్లింపు జరిగిందో తెలియలేదు. గడిచిన ఐదేళ్లలో పంటల బీమా పొందడంలో రైతులకు తృప్తి కలగలేదు.

అవసరమైన డాక్యుమెంట్స్‌

రైతు ప్రీమియం సొమ్మును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి.

ఆధార్‌ కార్డు, పనిచేస్తున్న ఫోన్‌ నెంబర్‌, భూమి డాక్యుమెంట్స్‌ జత చేయాలి.

పంట వేసినప్పుడు వ్యవసాయ విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి ధ్రువపత్రం

తీసుకుని బ్యాంక్‌ అకౌంట్‌ మొదటి పేజీని అప్‌లోడ్‌ చేయాలి.

ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లింపులకు ఏమైనా సహకారం కావాలంటే ఆర్‌ఎస్‌కే సిబ్బందిని సంప్రదించవచ్చు.

భరోసా ఇచ్చినట్లే

వరి సాగులో పెట్టుబడి పెరిగింది. ఎకరానికి రూ.35 వేలు అవుతోంది. ప్రకృతి దెబ్బ తీసి పంట పోతే కష్టాల్లోకి కూరుకుపోతాం. పంటల బీమా సక్రమంగా అమ లైతే పరిహారం చేయుతస్తుంది. రాబోయే దాళ్వా నుంచి వచ్చే బీమా విధానం రైతులకు పెట్టుబడి భరోసా ఉన్నట్లే.

– పి.శ్రీనివాసరావు, మత్స్యపురి

కొన్నేళ్లుగా సార్వా మాదిరి దాళ్వాలోను దెబ్బ తింటున్నాం. రెండు పంటలకు బీమా అవస రం. గతంలో బీమా పొందడంలో సరైన విధానంలో జరగలేదు. ఈసారి సరిగా అమల వుతుందని భావిస్తున్నాం.

– కె.సత్యనారాయణ, బొబ్బనపల్లి

పంటల బీమా ప్రీమియం ఎక్కువ మంది కలిసి ఒకే ప్రీమియంగా కట్టకండి. ఎవరికి వారు సింగిల్‌గానే చెల్లింపులు చేసుకోవాలి. ఏమైనా అవసరమైతే ఆర్‌ఎస్‌కే సిబ్బందిని సంప్రదించండి. –జెడ్‌.వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి

Updated Date - Oct 26 , 2024 | 12:59 AM