Share News

వైద్యశాఖకు అవినీతి రోగం

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:41 AM

జిల్లా వైద్యఆరోగ్యశాఖలో అవినీతిపర్వం తారాస్థాయికి చేరింది.

వైద్యశాఖకు అవినీతి రోగం

ఐదు కీలక విభాగాలకు ఒక్కరే దిక్కు!

జిల్లా అధికారి మిలాఖత్‌పై ప్రచారం

వైద్యాధికారులపై వేధింపులు

ఉద్యోగులకు అక్రమ డిప్యుటేషన్లు

షాడో వైద్యాధికారికి కొత్త డీఎంహెచ్‌వో చికిత్స తప్పనిసరి

జిల్లా వైద్యఆరోగ్యశాఖలో అవినీతిపర్వం తారాస్థాయికి చేరింది. ప్రభుత్వ ప్రాధామ్యాల్లో కీలకమైనశాఖగావున్న ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జిల్లా పరిధిలో ఓ సాధారణ వైద్యాధికారిగా ఉద్యోగ ప్రవేశంచేసిన ఓ జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ షాడో డీఎంహెచ్‌వోగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమైంది. సంబంధితశాఖ జిల్లా అధికారి అండదండలతో జిల్లాలోని పీహెచ్‌సీల మెడికల్‌ ఆఫీసర్లపై పెత్తనంచేస్తుండటం, నెలవారీ మామూళ్ళను నిర్దేశించడం, నిర్ణీత నగదు టార్గెట్లు ముట్టజెప్పనివారిని ఏదోఒక విషయంలో విచారణలపేరుతో వేధిస్తుండటం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీహెచ్‌సీలకు వచ్చే గర్బిణులకు పురుడుపోయకుండా ఏదోఒక వైద్యకారణాన్ని సాకుగా చూపించి స్థానికంగావున్న ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేయాల్సిందిగా వైద్యాధికారులపై ఒత్తిడిచేయడం, సహకరించని మెడికల్‌ ఆఫీసర్లపై కక్షసాధింపులు కొంతకాలంగా తీవ్ర మయ్యాయని సమాచారం. తన వెనుక ఓ ఎమ్మెల్యే ఉన్నందున తననేమీ చేయలేరంటూ జిల్లా అధికారి అండదండలతో ఆ మెడికల్‌ ఆఫీసర్‌ అక్రమాలకు తెగబడుతున్నారు.

ఏలూరు అర్బన్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):జిల్లా వైద్యఆరోగ్యశాఖలో చేపట్టే అన్ని కార్యక లాపాలు, ఉద్యోగులు, మెడికల్‌ ఆఫీసర్లకు విధుల కేటాయింపు, వారి సర్వీసుల పర్యవేక్షణ, ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు, వాటి కార్యకలాపాల పరిశీలన తదితర అంశాలపై డీఎంహెచ్‌వోకు సహకరించేందుకు పరిపాలన విభాగం, ఎఫ్‌డీపీ, ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌, ఐడీఎస్‌పీ, పారామెడికల్‌ విభాగం తదితర సెక్షన్లు ఉంటాయి. ఈ విభాగాలన్నింటికీ వేర్వేరుగా వైద్యాధికారులు, అధి కారులు, పర్యవేక్షకులు ఉండాలి. కాని వీటన్నిం టికీ కలిపి ఒకరికే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిం చడం, అందులోనూ కాంట్రాక్టు ప్రాతిపది కన నియమితులైన ఓ మెడికల్‌ ఆఫీసర్‌ తన ప్రొబేషన్‌కాలంలో పలు ఆరోపణలు, విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యం, కొవిడ్‌ సంక్షోభ రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా వంద రోజుల పాటు విధులకు ఎగనామం పెట్టడం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ఏరికోరి ఏకంగా ఐదు విభాగాలకు బాధ్యతలు అప్పగించడం వెనుక జిల్లా అధికారి మిలాఖత్‌ కావడమేనని ప్రచారం జరుగుతోంది. కీలకమైన ఈ ఐదు విభాగాలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడానికి కనీసం కలెక్టర్‌ నుంచి అనుమతి కూడా తీసుకోకుండానే నియామకాలు జరిగిపోవ డం విశేషం. పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఇన్‌సర్వీస్‌ కోటాకోసం రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీల మెడికల్‌ ఆఫీసర్లు ఇటీవల పదిరోజులపాటు చేసిన సమ్మెలో పాల్గొన్నవారిలో కొందరిని టార్గెట్‌గా చేసుకుని వేధింపు చర్యల్లో భాగంగానే ఈ ఐదు విభాగాలకు ఒకరినే నియమించినట్టు మరో ప్రచా రం ఉంది. జిల్లా వైద్యఆరోగ్యశాఖలో ‘వసూల్‌ రాజా’గా పేరొందిన అతడిని తన రెండో అవతార ంగా జిల్లా అధికారి నియమించుకుని యఽథేచ్ఛగా స్వలాభం పొందుతున్నట్టు సమాచారం. తనపట్ల ఆ మెడికల్‌ ఆఫీసర్‌ చూపిస్తోన్న వీరవిధేయతకు లబ్ధిచేకూర్చే క్రమంలో ప్రొబేషన్‌ పీరియడ్‌లో పెట్టిన వందరోజుల సెలవు పీరియడ్‌ను క్రమబ ద్ధీకరించేందుకు రాష్ట్ర కార్యాలయానికి కొద్దిరోజుల క్రితమే ప్రతిపాదనలను పంపించడం గమనార్హం. వాస్తవానికి జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయ ంలో కీలక విభాగాల కార్యకలాపాలను పర్యవేక్షిం చేందుకు ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌లో నియమించిన నలుగురు మెడికల్‌ ఆఫీసర్లు ప్రత్యే కంగా ఉండగా, అవసరమనుకుంటే వీరికి సంబం ధిత ఐదు విభాగాల బాధ్యతలను అప్పగించడం లేదా ఇతరులకు అప్పగించవచ్చు. దీనికి భిన్నంగా జిల్లా కేంద్రానికి చేరువగావున్న ఓ పీహెచ్‌సీకి నియమితులైన మెడికల్‌ ఆఫీసర్‌ను డబ్బులు బాగా దండుకునే దారులున్న ఐదు విభాగాలకు నియమించడాన్ని నిశితంగా పరిశీలిస్తే ....జిల్లాలో ఆ మెడికల్‌ ఆఫీసర్‌కుమించి సమర్దులెవరూ లేరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు పీహెచ్‌సీ లేదా ఆ ఐదు విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సిన సమయంలో స్థానికంగా వున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నిబంధనలను తుంగలోతొక్కి డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేస్తుండటాన్ని సంబంధిత ఆస్పత్రి సీసీ టీవీల ఫుటేజ్‌ను పరిశీలిస్తే ఇట్టే అక్రమాలు దొరికిపో తాయని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

అడ్డగోలు డిప్యుటేషన్లకు

కళ్ళెం ఎపుడో..

జిల్లాలోని వివిధ పీహెచ్‌సీల నుంచి డీఎం హెచ్‌వో కార్యాలయానికి ఫార్మసిస్టులు, సీని యర్‌ అసిస్టెంట్లు, ఎంపీహెచ్‌ఈవోలు, అటెం డర్లు తదితర కేడర్లలో సుదూర ప్రాంతాల నుంచి అక్రమ డిప్యూటేషన్లు వేసినట్టు తెలు స్తోంది. ఏజెన్సీ మండలాలతోపాటు, పోతునూ రు, కె.గోకవరం, చేబ్రోలు, చాటపర్రు, పెదవేగి, కాగుపాడు, ధర్మాజీగూడెం, గొల్లపల్లి, దొరమా మిడి తదితర పీహెచ్‌సీలతోపాటు, ఏలూరు పీపీ యూనిట్‌వంటిచోట్ల వైద్యసేవల నిర్వహ ణలో కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సినవారిని డీఎంహెచ్‌వో కార్యాలయానికి డిప్యూటేషన్లు ఇవ్వడానికి కనీసం కలెక్టర్‌ అనుమతులు కూడా లేవని సమాచారం. ఆ మెడికల్‌ ఆఫీసర్‌ను, మరికొందరిని జిల్లావైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కొనసాగించేందుకు జిల్లాలోని సుదూరప్రాంతాల పీహెచ్‌సీల వై ద్యాధికారులను డిప్యూటేషన్లపై వేయడంవల్ల ఆయా పీహెచ్‌సీల్లో వైద్యసేవలకు విఘాతం కలుగుతోందన్న విమర్శలున్నాయి. పీహెచ్‌సీల తనిఖీలకు ఓ ఎంపీహెచ్‌ఈవో, అటెండర్‌ స్థాయి వ్యక్తులతోకూడిన బృందం వెళుతుం డటం, మామూళ్ళు వసూలు చేసుకురావడం ఆ అక్రమార్కుడు, జిల్లా అధికారి అండద ండలే కారణమని తెలుస్తోంది. మెడికల్‌ లీవు లను హాజరుపట్టీలో నమోదు చేసే విషయ ంలోను, తిరిగివారంతా విధుల్లో చేరేటపుడు సమర్పించాల్సిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ విషయ ంలోను అడ్డదారులు జరుగుతున్నట్టు ప్రచా రం జరుగుతోంది. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు, తనిఖీలకు కాంట్రాక్టు ఉద్యో గులే నేరుగా వెళ్ళడం, మామూళ్ళు తెచ్చు కోవడం షరామామూలేనని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలిని తన శాఖలో వేళ్ళూనుకున్న అక్రమాలకు, అడ్డగోలు నియా మకాలకు చెక్‌ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది.

Updated Date - Dec 25 , 2024 | 12:41 AM