Share News

సీపీఐ కార్యాలయం కూల్చివేత

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:59 AM

బుట్టాయగూడెం మండల కేంద్రం రెడ్డిగణపవరం రూట్‌లో నూతనంగా నిర్మించిన సీపీఐ కార్యాలయ భవనాన్ని గురువారం సాయ ంత్రం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

సీపీఐ కార్యాలయం కూల్చివేత

బుట్టాయగూడెం, డిసెంబరు 26 (ఆంధ్ర జ్యోతి): బుట్టాయగూడెం మండల కేంద్రం రెడ్డిగణపవరం రూట్‌లో నూతనంగా నిర్మించిన సీపీఐ కార్యాలయ భవనాన్ని గురువారం సాయ ంత్రం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నూతనంగా నిర్మించిన ఈ కార్యాలయాన్ని ఈ నెల 27న ప్రారంభించేందుకు నాయకులు అన్ని సిద్ధం చేస్తున్నారు. కార్యాలయం ప్రారంభం సందర్భంగా భారీ బహిరంగ సభను కూడా నిర్వహించడానికి నాయకులు సిద్ధపడుతున్న తరుణంలో మండల రెవెన్యూ అధికారులు కార్యాలయాన్ని కూల్చివేడంపై ఆగ్రహా వేశాలు వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ నాయకుల వాదనలతో రెవెన్యూ అధి కారులు ఏకీభవించడంలేదు. కార్యాల యం నిర్మించిన స్థలం ప్రభుత్వానిది అని రెవెన్యూ అధికారులు చెబుతుం డగా ఈ స్థలం గతం నుంచి సీపీఐదే అంటూ నాయకులు స్పష్టం చేస్తు న్నారు. ఇదంతా నాలుగు సెంట్లు ప్రభుత్వం స్థలంగా అధికారులు చెబుతున్నారు. ఇందులో రెండున్నర సెంట్లు ఆక్రమించినట్టుగా అధికారు లు తెలిపారు. ఈ స్థలం విషయమై వివాదం నడుస్తుంది. కార్యాలయాన్ని కూల్చివేసే ముందు అధికారులు నోటీసులు కూడా ఇవ్వకపోవడంపై సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తు శుక్రవారం రెవెన్యూ, పోలీసు కార్యాలయాలు ఎదుట ఆందోళనలకు సిద్ధపడుతున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 27 , 2024 | 12:59 AM