Share News

డీసీసీబీ ఎవరి ఖాతాలోకి..

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:36 AM

వైసీపీ ప్రభుత్వంలో జిల్లా సహకార బ్యాంకు నిర్వీర్యం అయిపోయింది. అప్పుల్లో కూరుకుపోయింది. దానిని గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అందరి దృష్టి ఇప్పు డు డీసీసీబీపై పడింది. ఎన్నిక ద్వారా పాల క వర్గాన్ని నియమించేందుకు తొలుత కూట మి ప్రభుత్వం కసరత్తు చేసింది.

 డీసీసీబీ ఎవరి ఖాతాలోకి..

జిల్లాలో చర్చనీయాంశంగా మారిన చైర్మన్‌ పదవి

అధిష్ఠాన నిర్ణయంపై ఉత్కంఠ

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వంలో జిల్లా సహకార బ్యాంకు నిర్వీర్యం అయిపోయింది. అప్పుల్లో కూరుకుపోయింది. దానిని గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అందరి దృష్టి ఇప్పు డు డీసీసీబీపై పడింది. ఎన్నిక ద్వారా పాల క వర్గాన్ని నియమించేందుకు తొలుత కూట మి ప్రభుత్వం కసరత్తు చేసింది. కూటమిలో తెలుగుదేశం పార్టీకి డీసీసీబీ కేటాయిస్తారని అంతా నమ్ముతున్నారు. కూటమి అధిష్ఠానం కూడా ఆ దిశగానే కసరత్తు చేసింది. ఆశావ హుల అభిప్రాయాలను సేకరించింది. కేడర్‌ మనోభావాలను పరిగణలోకి తీసుకుంది. డీసీ సీబీ చైర్మన్‌ పదవి ఎవరికి ఇవ్వాలన్న విష యమై తర్జన భర్జన పడుతోంది. ఇటీవల మారిన సమీకరణాల్లో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. జనసేన కూడా డీసీసీబీ చైర్మ న్‌ పదవిని ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతో ంది. దాంతో తెలుగుదేశం ఆశావహుల్లో ఒకి ంత ఉత్కంఠ ఏర్పడింది.

జిల్లా నామినేటెడ్‌ పదవుల్లో

జనసేన పట్టు

జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఇచ్చిన పదవుల్లో జనసేన సైతం పట్టు సాధించింది. కార్పొరేషన్‌లతోపాటు, ప్రభుత్వ విప్‌, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ పద వులు ఆ పార్టీ నేతలకు దక్కాయి. ఇటీవల జరిగిన ప్రాజెక్ట్‌ కమిటీ ఎన్నికల విషయం లోనూ జనసేన ఆశించింది. ఉంగుటూరు నియోకవర్గానికి ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని జనసేన నుంచి ప్రతిపాదన వెళ్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అందుకు సైఅన్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లా నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని పట్టుబట్టారు. పశ్చిమడెల్టాలో అత్యధిక భాగం జిల్లాలోనే ఉంది. అందుకే ఇక్కడే చైర్మన్‌ పదవి ఇవ్వాలంటూ నేతలు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు చొరవ తీసుకు న్నారు. పశ్చిమడెల్టా ప్రాధాన్యాన్ని వివరిస్తూ డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌కు లేఖ రాశా రు. దాంతో ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ పదవి తెలుగుదేశం పార్టీకి వరించింది. మురళీ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో వైపు మత్స్యకార సహకార సంఘం చైర్మన్‌ పదవిని జనసేనకు కేటాయించారు. నర్సా పురం నియోజకవర్గానికి పదవి వెళ్లింది. ఇలా రెండు పార్టీల మధ్య సర్దుబాటు జరు గుతోంది. అయితే డీసీసీబీ ఎవరికి అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది.

ఉమ్మడి పదవులపై ఆశలు

ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఐదు రఽపధాన శాఖలు న్నాయి. వాటికి ఎవరిని నియిమంచాలనే దానిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోవా ల్సి ఉంది. ఇప్పుటికే ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పదవి ఉంది. అలాగే జిల్లా సహకార బ్యాంక్‌ (డీసీసీ బీ) డీసీఎంఎస్‌, గ్రంథాలయ సంస్థ, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖలు ఉ మ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ పదవుల కు కూటమిలో సర్దుబాటు కావా ల్సి ఉంది. అందులో ఒకటైన డీసీసీబీపై అందరి కన్ను పడిం ది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గానికి కేటా యించాలని కూటమి నిర్ణయించింది. కూట మిలో ఏ పార్టీకి పదవి దక్కినా సరే అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో డీసీసీబీ పైనే చర్చ సాగుతోంది. ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Dec 30 , 2024 | 12:37 AM