హార్టీకల్చర్ హబ్‌గా ఏలూరు జిల్లా
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:32 AM
ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచి ఏలూరు జిల్లాను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కె.వెట్రిసెల్వీ అన్నారు.
పెదవేగి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచి ఏలూరు జిల్లాను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కె.వెట్రిసెల్వీ అన్నారు. ఈ మేరకు అధికారులు రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మండలంలో ఉద్యానవన పంటలను కలెక్టర్ మంగళ వారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. దిబ్బగూడెంలో ఆయిల్‌పామ్, కొబ్బ రి, కోకో, మిరియం, పసుపు, ఆవకాడో పంటలు, గార్లమడుగులో అరటితోటలో బిందుసేద్యం, పెదవేగిలో ఏపీ ఆయిల్‌ఫెడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఆయిల్ పామ్‌లో అంతర పంట కోకో, లక్ష్మీపురంలో కొబ్బరి తోటలో దాల్చినచెక్క, యాలకులు, వక్క, జాజికాయ, లిచీ పంటలను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఉద్యానశాఖ డీడీ ఆర్.రామ్మోహన్, మైక్రో ఇరిగేషన్ పీడీ పి.రవికుమార్, తహ సీల్దారు ఎస్‌డీ.భ్రమరాంబ, ఉద్యానశాఖాధికారి కె.రత్నమాల పాల్గొన్నారు.
పరిశోధనా ఫలితాలు రైతులకు అందుబాటులోకి రావాలి
ప్రయోగశాలల్లోని పరిశోధనా ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందు బాటులోకి రావాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని కలెక్టర్ కె.వెట్రి సెల్వి అన్నారు. పెదవేగిలోని జాతీయ ఆయిల్‌పామ్ పరిశోధనా సంఛలనాల యమ్ (ఐకార్) కేంద్రం శాస్త్రవేత్తలతో కలెక్టర్ మాట్లాడారు. ఆధునిక వ్యవసా య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆ దిశగా కృషి చేయాలని చెప్పారు. ఐకార్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కంచర్ల సురేష్, శాస్త్రవేత్తలు ఎంవీ.ప్రసాద్, కె.మనోరమ, కె.రామ చంద్రుడు, రవిచంద్రన్, సుధాకర్ పాల్గొన్నారు.
రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని కలెక్టర్ వెట్రిసెల్వీ హెచ్చరించారు. రాయన్నపాలెంలో సీసీరోడ్డు నిర్మాణ మెటీరియల్, రహదారి వెడల్పు అంశాల ను పరిశీలించారు. రహదారి నాణ్యతపై అధికారులు బాధ్యతతో పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ వెంట పీఆర్ ఇన్‌చార్జ్ ఎస్‌ఈ రమణమూర్తి, డీఈ శ్రీనివాసరావు, ఏఈ మురళి, ఎంపీడీవో శ్రీనివాస్ ఉన్నారు.