కుక్కలపై ఏదీ కదలిక ?
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:28 AM
వీధి కుక్కల బెడదను నివారించేందుకు వాటికి చేయాల్సిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ప్రక్రియ అనుకున్న స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. వీధి కుక్కల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుం డడంతో వీటి నిర్మూలనకు అవకాశం లేకపోవడంతో కుటుంబ నియంత్రణే మేలని మునిసిపాల్టీలు భావిం చాయి.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో మున్సిపల్ అధికారులు విఫలం
ఒక్కొక్క ఆపరేషన్‌కు రూ.1500.. భీమవరం, తాడేపల్లిగూడెంలోనే అవకాశం
ఆరు మున్సిపాలిటీల్లో 4,297 కుక్కల గుర్తింపు.. సర్జరీలు జరిగినవి 292
భీమవరం టౌన్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల బెడదను నివారించేందుకు వాటికి చేయాల్సిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ప్రక్రియ అనుకున్న స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. వీధి కుక్కల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుం డడంతో వీటి నిర్మూలనకు అవకాశం లేకపోవడంతో కుటుంబ నియంత్రణే మేలని మునిసిపాల్టీలు భావిం చాయి. గతంలో ఈ విధానానికి మంచి స్పందన రావడంతో ఆపరేషన్లు చేయించేందుకు ఒక సంస్థకు కాం ట్రాక్టు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకు మునిసిపాల్టీల ద్వారా ఆపరేషన్‌లకు అవసరమైన భవనం, కుక్కలను ఉంచేందుకు ప్రత్యేక గదులు, వాటికి ఆహా రం అందించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. ఏ ప్రాం తం నుంచి తీసుకువచ్చిన కుక్కలను ఆపరేషన్ అనం తరం తిరిగి అదే ప్రాంతంలో వదిలేసేలా చర్యలు తీసుకున్నారు. ఇది ఒక్క భీమవరం మునిసిపాల్టీలో తప్ప మిగతా మునిసిపాల్టీల్లో పురోగతి కనిపించడం లేదు. దీనిపై మునిసిపల్ ఆర్డీ సీహెచ్ నాగనరసింహారావు రెండు రోజుల క్రితం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఒప్పందం కుదుర్చుకున్న సొసైటీతో ఎందు కు ఆపరేషన్‌లు చేయించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకుని పురోగతి చూపించాలని ఆదేశించారు. గతంలో ఆపరేషన్‌లు చేసే సంస్థ పక్కకు తప్పుకోవడంతో మరో కొత్త సంస్థకు అప్పగించారు. స్నేహ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఇప్పుడు ఆపరేషన్లు చేయిస్తున్నారు. రెండు నెలల కిత్రం భీమవరం మునిసిపాల్టీలో కుక్కలకు ఆపరేషన్‌లు చేశారు. తాజాగా ఈ ప్రక్రియ ఆగిపోయింది.
4,297 కుక్కల గుర్తింపు
జిల్లాలోని ఆరు మునిసిపాల్టీల సిబ్బంది చేసిన సర్వేలో నాలుగు వేల 297 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఎక్కువగా భీమవరం, తాడేపల్లిగూడెం ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క భీమవరంలోనే కుక్కలకు 292 ఆపరేషన్‌లు జరిగాయి. మిగతా మునిసిపాల్టీల్లో పురోగతి లేదు. ఇచ్చిన లక్ష్యాలను చేరుకోలేకపోయారు. ఆపరేషన్‌లు చేసేందుకు ఇటీవల స్నేహ వెల్పేర్ సొసైటీ ముందుకు వచ్చిందని, దీనిద్వారా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క ఆపరేషన్‌కు రూ.1500 చొప్పున చెల్లిస్తున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేసేందుకు భీమవరం, తాడేపల్లిగూడెం మునిసిపాల్టీ మాత్రమే అవసరమైన రూమ్, వాటి ఉంచే గదులు ఉన్నాయి. మిగతా మునిసిపాల్టీలకు లేకపోవటంతో పట్టుకున్న కుక్కలను భీమవరం, తాడేపల్లిగూడెం పంపించి ఆపరేషన్‌లు చేయించాల్సిన పరిస్థితి. పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు మునిసిపాల్టీల నుంచి భీమవరం పంపించి ఆపరేషన్‌లు చేయించేలా ప్రయత్నాలు చేస్తున్నాయి.
మునిసిపాల్టీల వారీగా వీధి కుక్కలు
భీమవరం 1455 తాడేపల్లిగూడెం 1126
పాలకొల్లు 501 నరసాపురం 655
తణుకు 425 ఆకివీడు 135